Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 129455
            [news_title_telugu_html] => నైపుణ్య వేదిక.. సమాచార దీపిక!
            [news_title_telugu] => నైపుణ్య వేదిక.. సమాచార దీపిక!
            [news_title_english] => 
            [news_short_description] => ఏం చదవాలి.. ఎలా చదవాలి.. ఎందుకు చదవాలి.. చదివితే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో స్పష్టత వస్తే ఆ దిశగా విద్యార్థులు మంచి పునాది వేసుకోగలరు. ఈక్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల్లోని 9, 10 తరగతుల విద్యార్థులకు ‘జీవన నై

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => | |
            [news_videoinfo] => | |
            [publish_comments_public] => 
            [publish_createdon] => 2019-07-21 01:33:46
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
నైపుణ్య వేదిక.. సమాచార దీపిక! - EENADU
close

తాజా వార్తలు

నైపుణ్య వేదిక.. సమాచార దీపిక!

 సామర్థ్యాల పెంపునకు వారధి

 9, 10 తరగతుల పిల్లలకు మేలు

 

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు

న్యూస్‌టుడే-అనంతపురం విద్య: ఏం చదవాలి.. ఎలా చదవాలి.. ఎందుకు చదవాలి.. చదివితే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో స్పష్టత వస్తే ఆ దిశగా విద్యార్థులు మంచి పునాది వేసుకోగలరు. ఈక్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల్లోని 9, 10 తరగతుల విద్యార్థులకు ‘జీవన నైపుణ్యాలు- కెరీర్‌ గైడెన్స్‌’ పేరుతో రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్‌ (ఆర్‌ఎంఎస్‌ఏ) ద్వారా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈపద్ధతిలో విద్యార్థుల్లో నైపుణ్యాలకు అనుగుణంగా ఎటువైపు వెళ్లాలో అవగాహన కల్పించనున్నారు. ముందుగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విషయ నిపుణులతో అవగాహనకు శ్రీకారం చుట్టారు. తాజా విద్యాసంవత్సరంలో విద్యార్థుల భవితకు, నైపుణ్యాలకు చుక్కానిలా ఉండే ‘విద్యార్థి సమాచార దీపిక’ పుస్తకం పేరుతో జీవన నైపుణ్యాలు, విద్యా కోర్సులతో ఉన్న భవిత పుస్తకాన్ని పాఠశాల విద్యా శాఖ అందిస్తోంది.

63 వేల మందికి ప్రయోజనం...

ప్రస్తుత విద్యాసంవత్సరంలో జిల్లాలో 63 వేల మంది 9, 10 తరగతులు చదువుతున్నారు. ఇప్పటికే విద్యార్థులకు కోర్సుల గురించి అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు విద్యను అభ్యసిస్తారు. ఆయా కోర్సులకు సంబంధించి పెద్దగా అవగాహన ఉండదు. చదువుకొనే సమయంలోనే వారికి అవగాహన కల్పిస్తే ఉపయుక్తంగా ఉంటుంది.

ప్రతి విద్యార్థికి ఓ పుస్తకం...

జిల్లాలో 9, 10 తరగతుల పాఠశాలలు 499 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ఓ పుస్తకాన్ని ఉచితంగా అందిస్తారు. మొత్తం 28 పేజీలతో ఉన్న ఈ పుస్తకంలో ఏతరహా జీవన నైపుణ్యాలు నేర్చుకోవాలి? కెరీర్‌ గైడెన్స్‌? ఇలా.. రెండు విభాగాలు ఏర్పాటు చేశారు. కేవలం చదువు ఒక్కటే కాదు... చదువు పూర్తి చేశాక ఏ తరహా ఉపాధి అవకాశాలు ఉంటాయో విద్యార్థులకు అవగాహన ఉంటే విద్యపై మరింత ఆసక్తి పెరుగుతుంది. లేని పక్షంలో గమ్యం తెలియక ఎటు వైపు వెళ్లాలో ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు కరదీపిక పుస్తకాన్ని సంబంధిత ఉప విద్యాధికారుల కార్యాలయం నుంచి తీసుకెళ్లాలి.

ఆ ఐదు భవితకు కీలకం...

కెరీర్‌ను ఎంపిక చేసుకోవడానికి పంచ సూత్రం తప్పని సరి. ఆసక్తి, నైపుణ్యం, వ్యక్తిత్వం, సాధారణ అనుకూల పరిస్థితి, అవకాశాలు... కీలకంగా మారనున్నాయి. భవితను తీర్చిదిద్దుకోవడానికి ఈ ఐదు సూత్రాలు కొలమానంగా నిలుస్తాయి.

పది తర్వాత ఇష్టమైన మార్గం...

పదోతరగతి తర్వాత ఎటు వైపు వెళ్లాలో విద్యార్థులకు ఈ పుస్తకం ఉపయుక్తం కానుంది. పాలిటెక్నిక్‌, ఐటీఐ, డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌, డిప్లొమా ఇన్‌ హార్టికల్చర్‌, ఇంటర్‌, వృత్తి విద్య, ఏపీఆర్జేసీ, ఏపీఎస్‌డబ్ల్యూ ఆర్జేసీ, ఏపీటీడబ్ల్యూ ఆర్జేసీ, ట్రిపుల్‌ఐటీ, ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌, ఫ్యాషన్‌ టెక్నాలజీ అండ్‌ డిజైనింగ్‌, ఇంటీరియర్‌ డిజైనింగ్‌, డిఫెన్స్‌ అండ్‌ ఆర్మీ, పైలట్‌, డాక్టర్‌, ఫార్మసిస్టు, పారామెడికల్‌ కోర్సులు, నర్సింగ్‌, అగ్రికల్చర్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్‌, ఎంబీఏ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, టీచర్‌, పోలీస్‌, లాయర్‌, సైంటిస్ట్‌, ఫైన్‌ ఆర్ట్స్‌, సోషల్‌ వర్కర్‌, బ్యాంకింగ్‌, జర్నలిజం, దూరవిద్య, సివిల్‌ సర్వీసులు, ప్రభుత్వ వసతి గృహాలు, 16 రకాల ఉపకార వేతనాలు ఇలా వివిధ అంశాలు పుస్తకంలో పొందుపరిచారు. కోర్సు పేరు... ప్రవేశం, ప్రకటన ఎప్పుడు వస్తుంది? చేసిన కోర్సుకు ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయి? ఏ కోర్సుకు ఎలాంటి ఉద్యోగాలు వస్తాయో విపులంగా అందులో పొందుపరిచారు. తద్వారా 9, 10 తరగతుల్లోనే వారికి ఇష్టమైన రంగంలో స్థిరపడటానికి కలలు కనడంతో పాటు ఆ కలల సాకారానికి మార్గం సుగమం అవుతుందన్నదే ఉద్దేశం.

సమాచార దీపిక ఇదే...

 

 

 

 

 


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.