Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143665
            [news_title_telugu_html] => 

మినీ జేసీబీ నడపబోయి వ్యక్తి మృతి

[news_title_telugu] => మినీ జేసీబీ నడపబోయి వ్యక్తి మృతి [news_title_english] => [news_short_description] => మినీ జేసీబీ యంత్రాన్ని నడపబోయి ప్రమాదవ శాత్తూ వ్యక్తి మృతి చెందిన సంఘటన బంగారుపాళ్యం ఎస్సీ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... స్వచ్ఛభారత్‌ [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 01:53:11 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మినీ జేసీబీ నడపబోయి వ్యక్తి మృతి - EENADU
close

తాజా వార్తలు

మినీ జేసీబీ నడపబోయి వ్యక్తి మృతి
వినోద్‌
 

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: మినీ జేసీబీ యంత్రాన్ని నడపబోయి ప్రమాదవ శాత్తూ వ్యక్తి మృతి చెందిన సంఘటన బంగారుపాళ్యం ఎస్సీ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా మురుగునీటి కాలువలు, వీధుల్లోని చెత్తను శుభ్రం చేయడానికి ప్రభుత్వం కేటాయించిన మినీ జేసీబీ యంత్రం బంగారుపాళ్యంలో ఉంది. ఈ యంత్రంతో డ్రైవరు కౌసల్‌ శనివారం బంగారుపాళ్యంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిసరాల్లో పరిశుభ్రత పనులు చేశారు. ఆ తర్వాత సింగిల్‌ విండో భవనం వద్ద నిలిపి అల్పాహారం చేయడానికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో బంగారుపాళ్యం ఎస్సీ కాలనీకి చెందిన వినోద్‌(26) జేసీబీ యంత్రాన్ని నడపడానికి ప్రయత్నించారు. జేసీబీ స్టార్టు కావడంతో పాటు చెత్తను శుభ్రం చేసే సామగ్రి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం బంగారుపాళ్యం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు క్షతగాత్రుడిని పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఎస్సై రామకృష్ణయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో వినోద్‌ మృతి చెందాడన్న సమాచారంతో బంగారుపాళ్యం ఎస్సీకాలనీ వాసులు వందలాది మంది ఆస్పత్రికి చేరుకున్నారు. బంధువులు, మిత్రులు, కుటుంబసభ్యుల ఆర్తనాదాలతో ఆస్పత్రి మారుమోగింది.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.