Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144150
            [news_title_telugu_html] => మాల మహానాడు కార్యదర్శి హత్య
            [news_title_telugu] => మాల మహానాడు కార్యదర్శి హత్య
            [news_title_english] => 
            [news_short_description] => పట్టణానికి చెందిన మాలమహానాడు పట్టణ కార్యదర్శి, తెదేపా నాయకుడు శంకర్‌ (52) ఆదివారం ఉదయం హత్యకు గురయ్యారు. సంఘటన తర్వాత తీవ్రంగా గాయపడిన అతని ప్రాణాలు కాపాడటానికి కుంటుంబ సభ్యులు, మిత్రులు, మాలమహానాడుకు చెందిన నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హత్యా సంఘటన 

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => | |
            [publish_comments_public] => 
            [publish_createdon] => 2019-08-19 01:19:30
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
మాల మహానాడు కార్యదర్శి హత్య - EENADU
close

తాజా వార్తలు

మాల మహానాడు కార్యదర్శి హత్య

రక్తపు మరకలు ఆరకముందే కేసు ఛేదించిన పోలీసులు

 

ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్న వేలిముద్రల నిపుణులు

గుంతకల్లు, న్యూస్‌టుడే : పట్టణానికి చెందిన మాలమహానాడు పట్టణ కార్యదర్శి, తెదేపా నాయకుడు శంకర్‌ (52) ఆదివారం ఉదయం హత్యకు గురయ్యారు. సంఘటన తర్వాత తీవ్రంగా గాయపడిన అతని ప్రాణాలు కాపాడటానికి కుంటుంబ సభ్యులు, మిత్రులు, మాలమహానాడుకు చెందిన నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హత్యా సంఘటన బెంచికొట్టాలో జరిగింది. నిందితుడు లక్ష్మీనారాయణ అలియాస్‌ చిన్నసుధాకర్‌ను పోలీసులు సంఘటన జరిగిన అరగంటలోపే అదుపులోకి తీసుకున్నారు. సంఘటనకు సంబంధించి ఒకటో పట్టణ సి.ఐ. ఉమామహేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...మస్తాన్‌పేటలో కాపురముంటున్న శంకర్‌ బెంచికొట్టాలలో శుద్ధజల నీటి ప్లాంటును నిర్వహిస్తున్నారు. ఇదే కాలనీకి చెందిన లక్ష్మీనారాయణ, శంకర్‌లు శనివారం రాత్రి మాటమాట పెరిగి పరస్పరం వాదించుకున్నారు. అనంతరం ఘర్షణ పడ్డారు. తనను లక్ష్మీనారాయణ కొట్టాడని శంకర్‌ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులు, మిత్రులకు తెలిపారు. దీంతో శంకర్‌ వర్గీయులు రాత్రి లక్ష్మీనారాయణను కొట్టి శంకర్‌కు క్షమాపణ చెప్పించారు. క్షమాపణ చెప్పడం చిన్నతనంగా భావించిన లక్ష్మీనారాయణ కక్షను పెంచుకొని శంకర్‌ను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం ఉదయం శంకర్‌ నీటి ప్లాంటు తలుపులను తెరుస్తుండగా కాపుకాసిన లక్ష్మీనారాయణ వెంటనే దాడిచేసి కత్తితో కడుపులో పొడిచి పారిపోయాడు. అడ్డు వచ్చిన వారిని కూడా పొడవడానికి ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన శంకర్‌ను కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో రైల్వే ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అతను మరణించినట్లు ధ్రువీకరించారు.

హత్యకు గురైన శంకర్‌

రక్తపు మరకలు ఆరకముందే..

విషయం తెలియగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. డి.ఎస్‌.పి. ఖాసింసాబ్‌, సీఐ ఉమామహేశ్వర్‌రెడ్డి సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. హత్యా స్థలంలో రక్తపు మరకలు ఆరకముందే నిందితుణ్ని అతని ఇంట్లో అదుపులోకి తీసుకొన్నట్లు సమాచారం. నిందితుడిపై హత్యా నేరమే కాకుండా ఎస్సీ, ఎస్టీ వేధింపు కేసును కూడా నమోదు చేయాలని మాలమహానాడు నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేశారు. అనంతపురం నుంచి వచ్చిన వేలిముద్రల నిపుణులు హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. శంకర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నిందితుడు లక్ష్మీనారాయణ పెయింటర్‌గా, శ్మశానంలో గుంతలు తవ్వించే వృత్తిని సాగిస్తున్నాడు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.