Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144160
            [news_title_telugu_html] => పుడమి పులకింత!
            [news_title_telugu] => పుడమి పులకింత!
            [news_title_english] => 
            [news_short_description] => జిల్లాపై వరుణుడు దయచూపాడు. శుక్రవారం రాత్రి ప్రారంభమైన వర్షం ఆదివారం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. తూర్పు మండలాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షం కురవగా.. పశ్చిమ మండలాల్లో తేలికపాటి నుంచి చిరుజల్లులు పడ్డాయి. ఎడతెరపి లేకుండా చినుకులు పడుతుండటంతో భూమి బాగా తడిసింది. ఖరీఫ్‌ మొదలై మూడు నెలలు కావస్తున్నా నేటికి రెండు దఫాలుగా కురిసిన జల్లులే తప్ప భారీ వర్షం జాడలేదు

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => | |
            [publish_comments_public] => 
            [publish_createdon] => 2019-08-19 01:29:18
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
పుడమి పులకింత! - EENADU
close

తాజా వార్తలు

పుడమి పులకింత!

● పంటలకు ప్రాణం పోసిన వర్షం

● స్వల్పంగా పెరగనున్న భూగర్భజలాలు

యాదమరి మండలం కోణాపల్లె వద్ద పచ్చపచ్చగా కళకళలాడుతున్న వేరుసెనగ

న్యూస్‌టుడే, చిత్తూరు(వ్యవసాయం): జిల్లాపై వరుణుడు దయచూపాడు. శుక్రవారం రాత్రి ప్రారంభమైన వర్షం ఆదివారం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. తూర్పు మండలాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షం కురవగా.. పశ్చిమ మండలాల్లో తేలికపాటి నుంచి చిరుజల్లులు పడ్డాయి. ఎడతెరపి లేకుండా చినుకులు పడుతుండటంతో భూమి బాగా తడిసింది. ఖరీఫ్‌ మొదలై మూడు నెలలు కావస్తున్నా నేటికి రెండు దఫాలుగా కురిసిన జల్లులే తప్ప భారీ వర్షం జాడలేదు. ఫలితంగా తీవ్ర కరవు పరిస్థితి నెలకొంది. వేరుసెనగ పంట వాడుముఖం పడుతున్న తరుణంలో ప్రస్తుత వర్షం ప్రాణం పోసింది. ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఉపయుక్తం కానుంది. పశుగ్రాసం కొరతతో అల్లాడిపోతున్న మూగజీవాలకు వర్షం పుణ్యమాని గ్రాసం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో భూగర్భజలాలు కొంతైనా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తూర్పు మండలాల్లో వరి, ఉద్దులు, పెసల సాగు విస్తీర్ణం పెరగనుందని అధికారులు చెబుతున్నారు.

వేరుసెనగ, ఉద్యాన పంటలకు జీవం

వర్షం వేరుసెనగ, ఉద్యాన పంటలకు జీవం పోసింది. జిల్లాలో సుమారు 90వేల హెక్టార్లలో వేరుసెనగ సాగైంది. పశ్చిమ మండలాల్లో విస్తారంగా సాగైందని.. పంట విత్తినప్పటి నుంచి చినుకు లేకపోవడంతో పలు మండలాల్లో వేరుసెనగ ఎండిపోవడం, వాడుముఖం పట్టడంతో రైతుల ఆశలు సన్నగిల్లుతున్న తరుణంలో వర్షం పంటకు ఊపిరి పోసింది. ఉద్యాన పంటల్లో ప్రధానంగా మామిడి తోటలను వర్షం బతికించింది. తీవ్ర వర్షాభావంతో ఎండిపోయిన మామిడి చెట్లు కాస్త ప్రాణంతో బయటపడనున్నాయి. మిగిలిన కూరగాయలు, పండ్ల తోటల సాగుకు ఈ వర్షం ఒకింత లాభదాయకమని ఉద్యాన అధికారులు పేర్కొంటున్నారు.

తూర్పున భారీగా.. పశ్చిమంలో జల్లులుగా

రెండు రోజులుగా ముసురు ఆవరించడంతో ఆకాశం పూర్తిగా మేఘావృతమై వాతావరణం చల్లబడింది. పిచ్చాటూరు, కార్వేటినగరం, వెదురకుప్పం, నగరి, వడమాలపేట తదితర మండలాల్లో కురిసిన వర్షాలకు వంకలు ప్రవహించాయి. ఫలితంగా చెరువుల్లోకి నీరు చేరింది. దీంతో ఖరీఫ్‌ సాగుపై అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. వరి నాట్లు, ఇతర పంటల సాగుకు అన్నదాతలు సన్నద్ధమవుతున్నారు.

ప్రత్యామ్నాయానికి ఉపయోగం..

ప్రత్యామ్నాయ పంటల సాగుకు వర్షం ఉపయోగకరంగా మారింది. తీవ్ర వర్షాభావంతో 35-40 వేల హెక్టార్లలో వేరుసెనగ పంట సాగుకు నోచుకోలేదు. వేరుసెనగ సాగు కాని పొలాల్లో ప్రత్యామ్నాయ పంటలు ఉలవలు, రాగి, కొర్ర, జొన్న సాగును వ్యవసాయశాఖ ప్రోత్సహిస్తోంది. ఉలవ, రాగి విత్తనాలు ఉచితంగా రైతులకు అందజేస్తున్నారు. వర్షంతో ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా చెరువులు, జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. వాగులు, వంకలు ప్రవహించేలా విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాశం వైపు కోటి ఆశలతో అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.