Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146407
            [news_title_telugu_html] => జల్సాలకు అలవాటుపడి చోరీలు
            [news_title_telugu] => జల్సాలకు అలవాటుపడి చోరీలు
            [news_title_english] => 
            [news_short_description] => వ్యవసనాలు, జల్సాలకు అలవాడుపడి తాగుడుకు అవసరమైన డబ్బు కోసం వ్యవసాయ తోటల్లో, హంద్రీనీవా కాలువ, పీఏబీఆర్‌ జలాశయ ప్రాంతాల్లో రైతుల విద్యుత్తు మోటార్లను దొంగిలిస్తున్న ముఠాను గురువారం ఉరవకొండ పోలీసులు అరెస్టు చేశారు.

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-23 02:26:02
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
జల్సాలకు అలవాటుపడి చోరీలు - EENADU
close

తాజా వార్తలు

జల్సాలకు అలవాటుపడి చోరీలు


స్వాధీనం చేసుకున్న మోటార్లను చూపుతున్న పోలీసు అధికారులు

ఉరవకొండ, న్యూస్‌టుడే: వ్యవసనాలు, జల్సాలకు అలవాడుపడి తాగుడుకు అవసరమైన డబ్బు కోసం వ్యవసాయ తోటల్లో, హంద్రీనీవా కాలువ, పీఏబీఆర్‌ జలాశయ ప్రాంతాల్లో రైతుల విద్యుత్తు మోటార్లను దొంగిలిస్తున్న ముఠాను గురువారం ఉరవకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సాయంత్రం పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు ఎస్‌ఐ ధరణిబాబుతో కలిసి వెల్లడించారు. వివరాలిలా... ఉరవకొండ మండలం కోనాపురం గ్రామానికి చెందిన రామాంజనేయులు, మారుతి, మంజునాథ, ధనుంజయ, అక్కులప్ప, రాకెట్ల తండాకు చెందిన ప్రకాష్‌నాయక్‌ వ్యసనాలతో జల్సాలకు అలవాటుపడ్డారు. పగటిపూట వ్యవసాయ తోటలు, హంద్రీనీవా కాలువ, పీఏబీఆర్‌ జలాశయ పరిసరాల్లో ఉన్న వ్యవసాయ మోటార్లను గమనించేవారు. వాటిని రాత్రివేళ ఎవరూలేని సమయంలో నీటిలో నుంచి పైకి తీసి ముఠా సభ్యుడైన మారుతీకి చెందిన ఆటోలో పట్టణాలకు తరలించి అమ్ముకుని జల్సా చేసేవారు. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై నిఘా పెట్టిన పోలీసులు దొంగల ముఠాను గురువారం పట్టుకున్నారు. ఈ ముఠాలో ఆరుగురు సభ్యులు ఉండగా, అక్కులప్ప అనేవ్యక్తి పరారీలో ఉన్నాడు. గురువారం పోలీసులు పెన్నహోబిళం సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కోనాపురం నుంచి వారు దొంగిలించిన నాలుగు సబ్‌మెర్సిబుల్‌ మోటార్లతో ఆటోలో అనంతపురం వెళ్తుండగా గుర్తించి పట్టుకొన్నారు. మోటార్లను స్వాధీనం చేసుకుని ఆటోను జప్తు చేశారు. ఈ మోటార్ల విలువ రూ.1.06 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి వారికి సెప్టెంబరు 5 వరకు రిమాండు విధించినట్లు సీఐ వివరించారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.