Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146612
            [news_title_telugu_html] => రాకపోతే బతికేవాడేమో..
            [news_title_telugu] => రాకపోతే బతికేవాడేమో..
            [news_title_english] => 
            [news_short_description] => ఈకేవైసీ నమోదు కోసం వచ్చిన బాలుడికి ఆ అవసరమే లేకుండా పోయింది. కుమారుడికి రేషన్‌ సరకులు అందవేమోనని ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఇకపై భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వారి కుమారుడు మరణించాడు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. పాముకాటుతో 

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => | |
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-23 05:40:59
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
రాకపోతే బతికేవాడేమో.. - EENADU
close

తాజా వార్తలు

రాకపోతే బతికేవాడేమో..

పాము కాటుతో మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రుల ఆవేదన

ద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడుతున్న గిరిజన సంక్షేమ శాఖ అధికారి సురేష్‌కుమార్‌

సాలూరు, పాచిపెంట, న్యూస్‌టుడే: ఈకేవైసీ నమోదు కోసం వచ్చిన బాలుడికి ఆ అవసరమే లేకుండా పోయింది. కుమారుడికి రేషన్‌ సరకులు అందవేమోనని ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఇకపై భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వారి కుమారుడు మరణించాడు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. పాముకాటుతో విద్యార్థి మరణించిన ఘటన పాచిపెంట మండలంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని గుమ్మడిగూడకు చెందిన సీతయ్య, రామమ్మలు కుమారుడు పెదకాపు రాంబాబు (16) ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. పట్టణంలోని గిరిజన బాలుర వసతి గృహంలో ఉంటున్నాడు. ఈకేవైసీ కాకపోతే రేషన్‌ ఆపేస్తామన్న అధికారుల హెచ్చరికతో తల్లిదండ్రుల పిలుపు మేరకు మంగళవారం రాత్రి ఇంటికి చేరుకున్నాడు. బుధవారం ఈకేవైసీకి వెళ్లినా జనం ఎక్కువగా ఉండటంతో పని జరగలేదు. గురువారం వెళ్దామని తల్లిదండ్రులు చెప్పడంతో పోడుభూమిలో ఉన్న ఇంట్లో పడుకున్నాడు. రాత్రి 9గంటల సమయంలో నిద్రిస్తున్న రాంబాబును విషసర్పం కాటేసింది. వెంటనే భయంతో కేకలు పెట్టడంతో తల్లిదండ్రులు వచ్చి చూశారు. నోటి నుంచి నురగలు రావడం గమనించిన వారు పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి ఆటోలో తీసుకువచ్చారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఈకేవైసీకి తమ కుమారుడు రాకపోయినా బతికి ఉండేవాడని ఆసుపత్రిలోని రాంబాబు మృతదేహం వద్ద ఆయన తల్లిదండ్రులు రోదించారు. రేషన్‌ సరకులు వద్దనుకుంటే, 16ఏళ్లు అల్లారు ముద్దుగా పెంచిన కొడుకు బతికి ఉండేవాడని విలపించారు.

 

ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం: డీడీ

రాంబాబు కుటుంబాన్ని ఐటీడీఏ నుంచి ఆర్థిక సాయమందించి ఆదుకుంటామని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టరు సురేష్‌కుమార్‌ చెప్పారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఆయన, ఏటీడబ్ల్యూవో వరలక్ష్మి విద్యార్థి తల్లిదండ్రులను ఓదార్చారు. మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. దహన ఖర్చుల కోసం రూ.5వేలు అందించారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.