close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కలసపాడు: స్థానిక తెలుగుగంగ ప్రధాన ఎడమకాల్వకు సంబంధించి సగిలేరు ప్రధాన కాల్వపై నిర్మించిన అక్విడెట్‌కు గుర్తు తెలియని వ్యక్తులు యంత్రంతో రంధ్రంచేసి కిందకు పైపు ఏర్పాటు చేశారు. కొంతమంది తమ స్వార్థం కోసం ఈ చర్యకు పాల్పడినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అక్విడెట్‌ను కొన్నేళ్ల క్రితం రూ.2.50 కోట్లతో నిర్మించారు. ఈ విషయమై శుక్రవారం తెలుగుగంగ ఎస్‌ఈ శారదను వివరణ కోరగా ఈ ఘటన ప్రజాధనాన్ని నష్టపరచడమే అన్నారు. ఈ రంధ్రం ఏర్పాటు వల్ల భవిష్యత్తులో అక్విడెట్‌కు ఇబ్బంది కలగవచ్చని తెలిపారు. రంధ్రాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.