Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000889
            [news_title_telugu_html] => భూములున్నా... భుక్తి లేదు...!
            [news_title_telugu] => భూములున్నా... భుక్తి లేదు...!
            [news_title_english] => 
            [news_short_description] => భూములుంటే చాలు... జీవితానికి ఢోకా లేనట్టే అంటుంటారు... ఆ రైతులకు భూములున్నాయి, కానీ భుక్తి లేదు. ప్రభుత్వం దృష్టిలో వారు సంపాదనపరులే. కానీ ప్రకృతి మిగిల్చిన పేదలు. అయిదేళ్లుగా అయిదు వేళ్లూ నోట్లోకి వెళ్లక, అర్ధాకలితో... సాగు దాహంతో అల్లాడుతున్నారు. వారే సాగర్‌ పరీవాహక కర్షకులు. నీరిస్తే పసిడినైనా పండించగల శ్రామికులు...

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => | |
            [publish_comments_public] => 
            [publish_createdon] => 2019-08-25 03:33:23
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
భూములున్నా... భుక్తి లేదు...! - EENADU
close

తాజా వార్తలు

భూములున్నా... భుక్తి లేదు...!

● సాగర్‌ నీరిస్తేనే ఆయకట్టులో సాగు

● బీడుగా మిగిలిన లక్షలాది ఎకరాలు

● ఈ ఏడాది నీటిపై బోలెడు ఆశలు

సంతమాగులూరు పరిధిలో ఖాళీగా వదిలేసిన భూమి

భూములుంటే చాలు... జీవితానికి ఢోకా లేనట్టే అంటుంటారు... ఆ రైతులకు భూములున్నాయి, కానీ భుక్తి లేదు. ప్రభుత్వం దృష్టిలో వారు సంపాదనపరులే. కానీ ప్రకృతి మిగిల్చిన పేదలు. అయిదేళ్లుగా అయిదు వేళ్లూ నోట్లోకి వెళ్లక, అర్ధాకలితో... సాగు దాహంతో అల్లాడుతున్నారు. వారే సాగర్‌ పరీవాహక కర్షకులు. నీరిస్తే పసిడినైనా పండించగల శ్రామికులు...

ఈనాడు డిజిటల్‌- ఒంగోలు: ఆరు నియోజకవర్గాలు... 24 మండలాలు... 4.42 లక్షల ఎకరాలు... రెండు లక్షల మంది రైతులు... ఇదీ సాగర్‌ జలాలపై ఆధారడిన భూములు, రైతుల సంఖ్య. ఈ లక్షలాది మందికి ఎన్నో ప్రశ్నలు... సేద్యానికి నీరు ఇస్తారా? ఇవ్వరా? ఇస్తే ఆరుతడికి ఇస్తారా? పూర్తిస్థాయిలో ఇస్తారా...? ఆరు నెలలూ ఇస్తారా? మధ్యలో ఆపేస్తారా..? ఏం పంటలు వేయాలి? ఏ సాగు చేయాలి..? ఇదీ ఈ భూముల దాహం పరిస్థితి. సాగు దాహంతో అల్లాడుతున్న సాగర్‌ పరీవాహక భూములు, రైతుల పరిస్థితి ఇలా ఉంది. వరదలు వచ్చినా, నీరు పారినా జిల్లాలో ఈ రైతులకు మాత్రం నీటి భరోసా దక్కడం లేదు.

మూడేళ్లు అసలే లేవు... గత ఏడాది అరకొర...

జిల్లాలో సాధారణంగా ఏడు లక్షలకు పైగా వ్యవసాయ భూమి ఉండగా, దీనిలో 4.42 లక్షల ఎకరాలు సాగర్‌ కుడి కాలువ పరిధిలోనే ఉంది. అంటే దాదాపు 60 శాతం సేద్యానికి సాగర్‌ నీరే ఆధారం. ఈ భూములకు 2014 నుంచి నీరు సక్రమంగా అందడం లేదు. వర్షాల లేమి, కరవు కారణంగా వరుసగా మూడేళ్ల పాటు నీటిని ఇవ్వలేదు. సాగర్‌ నుంచి కేవలం తాగునీటికే తప్ప, సాగు అవసరాలకు 2015, 2016, 2017లో అసలు ఇవ్వలేదు. 2018లో మాత్రం ఆరుతడికి అంటూ 25 టీఎంసీల వరకు నీటిని ఇచ్చారు. ఈ పరిధిలోని లక్షన్నర ఎకరాల్లో రైతులు నాలుగేళ్లుగా పూర్తిగా భూములు వదిలేయగా, 70 వేల ఎకరాలకు పైగా సుబాబుల్‌ సాగు ఉంది. ఇవీ ఎండిపోతుండడంతో రైతులు ఈ పంటలను తొలగిస్తున్నారు. మరో లక్షన్నర ఎకరాలకు పైగా ఏటా అపరాలు, కంది సాగు చేసేవారు. గత ఏడాది 85 వేల ఎకరాల్లో వరి, మరో 70 వేల ఎకరాల్లో అపరాలు వేశారు. అరకొరగానే దిగుబడులు రావడంతో రైతులు చాలా వరకు నష్టపోయారు. మూడేళ్లు పూర్తిగా సేద్యం వదిలేసిన రైతులు గత ఏడాది నష్టాలతో చాలా ఇబ్బందుల్లో పడ్డారు. వేలాది మంది రైతులు కూలీలుగా మారగా, కొందరు రైతులు భూములను అమ్ముకున్నారు. సాగర్‌ పరిధిలోని కర్షకుల బతుకు చిత్రాలు ఈ అయిదేళ్ల వ్యవధిలో మారిపోయాయి.

స్పష్టత కోసం వేచి చూపులు

నాలుగేళ్లు అలా గడిచిపోయాయి. కరవు కాటుతో చాలా మంది రైతులు బలయ్యారు. భుక్తి లేనివారయ్యారు. కూలీలుగా మారారు. కానీ ఈ ఏడాది వారిలో ఆశలు చిగురించాయి. రాష్ట్రమంతటా జలాశయాలు నిండుతుండడం, సాగర్‌లో నీటి ప్రవాహం పెరగడం వారిలో విశ్వాసాన్ని నింపింది. నీళ్లు ఇవ్వడం ఖాయమే. కానీ ఆరుతడితో సరిపెడతారా? పూర్తిగా ఇస్తారా? అనేది తెలియడం లేదు. సాగర్‌ నీటిపై రైతులకు స్పష్టత కరువైంది. నీటి విడుదల కోసం లక్షలాది మంది రైతులు వేచి చూస్తున్నారు. నారుమళ్లు పోసుకుని కొందరు, దుక్కు దున్నుకుని కొందరు, నేల చూపులతో కొందరు వేచి చూస్తున్నారు. నీటి కోసం అధికారులు ప్రతిపాదించారు. సాగర్‌ పరిధిలోని మొత్తం భూమికి నీరు ఇవ్వాలంటే 52 టీఎంసీలు అవసరం ఉండగా 25 టీఎంసీల వరకు ఢోకా లేదని అధికారులూ చెబుతున్నారు. ఇవి ఆరుతడికే సరిపోతాయి. వరి వేస్తే మొత్తం నీరు ఇవ్వాల్సిందే. ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఈ పరిస్థితులపై జలవనరుల శాఖ ఎస్‌ఈ రెడ్డయ్యను వివరణ కోరగా, ఆరుతడికి మాత్రం నీరిస్తామని, వరికి అప్పుడే చెప్పలేమని అన్నారు. ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

●ఈ రైతు పేరు కుప్పాకుల శ్రీను. దర్శి మండలం, త్రిపురసుందరీపురం. తనకున్న పది ఎకరాల్లో 2016, 2017లో కంది వేశారు. అరకొరగా దిగుబడి వచ్చింది. గత ఏడాది వరి, కంది వేశారు. పెద్దగా దిగుబడులు రాక మూడేళ్లలో రూ. 4 లక్షల మేర అప్పుల పాలయ్యారు. ఇక చేసేదేం లేక రూ. 5 లక్షలకు ఎకరం పొలం అమ్మేసి, కుటుంబాన్ని పోషించుకునేందుకు హైదరాబాద్‌లో బేల్దారీ పనులకు వెళ్లిపోయారు. తాజాగా సాగర్‌ నీరిస్తున్నారని తెలుసుకుని తిరిగి వచ్చారు. కానీ నీటిపై సందేహం వీడలేదు.

●ఈ రైతు పేరు యర్రగుంట్ల చౌడయ్య. కురిచేడు మండలం వెంగాయపాలెం గ్రామం. సాగర్‌లో నీరు అందక 2015, 2016లో సాగు చేయలేదు. 2017లో కంది, గత ఏడాదిలో వరి వేశారు. అరకొరగా నీరు అందక దీన్నీ నష్టపోయారు. వరుసగా మూడేళ్లు భూమిని బీడుగా వదిలి కూలికి వెళ్లారు. నాలుగో ఏడాది కష్టం చేసి నష్టపోయారు. ఇలా భూమి ఉన్నా, పోషణ భారమైంది. ఈ ఏడాది సాగర్‌ నీటిని ఇస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారు.

●ఈయన పేరు రాయ కోటేశ్వరరావు. సంతమాగులూరు మేజర్‌ పరిధిలోని రెండున్నర ఎకరాల రైతు. 2015లో వరి, 2016లో కంది, 2017లో కంది, 2018లో వరి వేశారు. వరుసగా నాలుగేళ్లు నీరు రాక నష్టాలనే ఎదుర్కొన్నారు. రూ. లక్షల్లో అప్పులపాలయ్యారు. ఈ ఏడాది మాగాణి వేయాలా? ఆరుతడి వేయాలా? అనే సందేహంలో ఉన్నారు. సాగర్‌ పరిధిలో నీటి దాహంలో ఉన్న భూముల పరిస్థితి ఇదీ.

 


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.