Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001299
            [news_title_telugu_html] => మిస్టరీగా మారిన జంట హత్యలు
            [news_title_telugu] => మిస్టరీగా మారిన జంట హత్యలు
            [news_title_english] => 
            [news_short_description] => రామచంద్రపురం పట్టణంలో ఆదివారం జంట హత్యలు సంచలనం రేకెత్తించాయి. జిల్లా ఎస్పీ నయీం ఆస్మి సంఘటన స్థలాన్ని ఆదివారం పరిశీలించి దర్యాప్తు ముమ్మరం చేయడంతో కేసు మరింత వేడెక్కింది. తల్లీకూతుళ్లు బలసా మాధురి, బ

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => | |
            [publish_comments_public] => 
            [publish_createdon] => 2019-08-26 02:34:47
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
మిస్టరీగా మారిన జంట హత్యలు - EENADU
close

తాజా వార్తలు

మిస్టరీగా మారిన జంట హత్యలు

 కేకలు వినిపించలేదంటున్న స్థానికులు 

 పలు కోణాల్లో పోలీసుల దర్యాప్తు

 
బ్రాడీపేట ప్రాంతంలో జాగిలం పరుగు

రామచంద్రపురం, న్యూస్‌టుడే: రామచంద్రపురం పట్టణంలో ఆదివారం జంట హత్యలు సంచలనం రేకెత్తించాయి. జిల్లా ఎస్పీ నయీం ఆస్మి సంఘటన స్థలాన్ని ఆదివారం పరిశీలించి దర్యాప్తు ముమ్మరం చేయడంతో కేసు మరింత వేడెక్కింది. తల్లీకూతుళ్లు బలసా మాధురి, బలసా కరుణను ఒకేసారి ఒకే రకంగా కసిగా సుత్తితో మోది చంపాల్సిన అవసరం హంతకులకు ఎందుకు వచ్చింది.. కారణాలేంటి అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. బ్రాడీపేటలోని ఓ కార్పొరేట్‌ పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న తల్లి మాధురిని, నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసి వచ్చిన కుమార్తె కరుణను హత్యచేయాల్సిన అవసరం ఎవరికొచ్చింది అనేది తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

భిన్న కోణాలు

డబ్బు కోసమైతే వారు నిరుపేదలు, కుటుంబ కలహాలైతే భర్త శ్రీనివాస్‌ టీబీ పేషెంట్‌, కుమారుడు 16 ఏళ్ల లోపు వయసువాడే.. ఆ ఇద్దరినీ చంపాల్సిన అవసరం ఎందుకొస్తుంది.. ఇలా కేసు పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. హతులు ఉంటున్నది ఒక చిన్న పెంకుటిల్లు.. ఇంట్లో మాట్లాడుకునే మాటలే పక్క పోర్సన్‌లోకి వినిపిస్తుంటాయి. అలాంటిది రాత్రి పూట చిన్నగా మాట్లాడినా బయటకు వినిపించాల్సిందే.. అటువంటి చిన్న ఇంట్లో ఇద్దరిని ఎలా హత్య చేయగలిగారు? ఒకరిని చంపుతుంటే రెండోవారు సహజంగానే కేకలు వేస్తారు.. ఎందుకు వేయలేదు..? కేకలు బయటకు ఎందుకు వినిపించలేదు..? ఆహారంలో మత్తు మందు ముందుగానే కలిపి ఆ మత్తులో హత్యలు చేశారా..? టీవీ సౌండ్‌ ఎక్కువగా పెంచినా అది స్థానికులకు వినిపించాలి.. అలా జరిగిందని కొందరు చెబుతున్నారు. తల్లి నోట్లో గుడ్డలు కుక్కి ఉన్నాయని చూసిన వారు చెబుతున్నారు.. ఇద్దరినీ చంపడం ఒకరి వల్ల అవుతుందా అనేది మరో ప్రశ్న.. ఈ జంట హత్యలు ఎవరు చేశారనేది ప్రశ్నార్థకమే.. ఇక హంతకుడు వాడిన సుత్తి అక్కడే పడి ఉంది.. పైగా ఒక చిన్న కత్తి వంగిపోయి సంఘటన స్థలంలో ఉందని చెబుతున్నారు. పోలీసు జాగిలం సంఘటన స్థలం నుంచి మార్కెట్‌ సెంటర్‌ వరకు వెళ్లి తిరిగి అదే దారిలో వెనక్కి రావడంతో హంతకులు మార్కెట్‌ సెంటర్లో ఏదో ఒక వాహనం ఎక్కి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. మార్కెట్‌ సెంటర్లో సీసీ కెమెరాల్లో పుటేజీలను సేకరించినా కేసు ఒక కొలిక్కి వస్తుందనేది దర్యాప్తులో పరిశీలిస్తున్నట్లు సమాచారం. కొందరు మాత్రం తండ్రీ కొడుకులు ఇద్దరూ రాత్రి వచ్చారని రాత్రి 10 గంటల తర్వాత ఒక బైక్‌, ఒక సైకిల్‌ ఇంటి ముందు ఉందని స్థానికులు చెబుతున్నారు.

అందరితో కలివిడిగా..

ఆ కుటుంబం వీధిలో ఎవరి జోలికి వెళ్లకుండా వారి పని వారు చేసుకుంటూ జీవిస్తారని, అటువంటివారు హత్యకు గురికావడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. తణుకులో నర్సింగ్‌ కోర్సు చదివి వచ్చిన కుమార్తె కరుణకు అక్కడగాని, ఇక్కడగాని ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా.. అటువంటి కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఇటీవల తన భర్తకు ఆరోగ్యం బాగా ఉండడం లేదని తోటి పనివారికి మాధురి చెప్పేదని మాత్రం చెబుతున్నారు.

 
స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్న ఎస్పీ నయీం ఆస్మి


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.