close

తాజా వార్తలు

ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య

మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

గుంటూరు: తెదేపా అధినేత చంద్రబాబు పిలుపు మేరకు మంగళవారం గుంటూరులో కోడెల సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కోడెల ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమంటూ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. లాడ్జి సెంటర్ నుంచి పార్టీ కార్యాలయం వరకు ఈ ప్రదర్శన సాగింది. గుంటూరు జిల్లా తెదేపా నాయకులు, కార్యకర్తలు ఈ నిరసన ర్యాలీలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘కోడెల అమర్‌ రహే’ అంటూ శ్రద్ధాంజలి ఘటించారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.