close

తాజా వార్తలు

విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి

ప్రదీప్‌ మృతదేహం

పీఎస్‌ గేటు(ఐరాల), న్యూస్‌టుడే: మండలంలోని పాటూరు సంతగేటులో బుధవారం రాత్రి విద్యుదాఘాతానికి గురైన యువకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది... స్థానికుల కథనం మేరకు వివరాలు.... బెంగళూరుకు చెందిన ప్రదీప్‌(25) స్థానికంగా ఉన్న ఓ బేకరిలో పని చేస్తున్నాడు. బేకరి యజమానికి మూడు రోజులగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ప్రదీప్‌ బేకరీ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం బేకరికి అవసరమైన పదార్థాలు చేసేందుకు... గ్రైండర్‌ను వినియోగిస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.


మోసం కేసు నమోదు

పలమనేరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి రూ. 5 లక్షలు వసూలు చేసిన తర్వాత అదృశ్యమైన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పి.అశిలేష్‌ అనే వ్యక్తిపై పలమనేరు పోలీసుస్టేషన్‌లో మోసం కేసు నమోదైంది. హైదరాబాదులో ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి పలమనేరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినితో పాటు మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి నుంచి అశిలేష్‌ సుమారు రూ.5 లక్షలు బ్యాంకు ఖాతాలో వేయించుకున్నాడు. ఆ తర్వాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయడంతో పాటు ఎలాంటి సమాచారం లేకపోవడంతో బాధితులు పోలీసుస్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ విచారిస్తున్నారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.