close

తాజా వార్తలు

చిరు వ్యాపారులకు దన్ను

 అందుబాటులోకి రానున్న 150 మంది అకౌంటెంట్లు

 జీఎస్‌టీ రిటరు్నల దాఖలు ప్రక్రియ సులభతరానికి ప్రభుత్వం కసరత్తు

 

కాకినాడ, ఈనాడు: జీఎస్‌టీ అమల్లోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యాయి. నేటికీ రిటర్నుల దాఖలు విషయంలో చాలా మంది వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. వారికీ ఊరటనిచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మండల స్థాయిలో అకౌంటెంట్లను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా జీఎస్టీ పరిధిలో 36 వేల మంది వ్యాపారులున్నారు. వీరిలో రాష్ట్ర పన్నుల శాఖ పరిధిలో 24 వేల మంది, కేంద్ర పన్నుల శాఖ పరిధిలో 12 వేల మంది వ్యాపారులున్నారు. ఏడాదికి రూ.40 లక్షల వ్యాపార లావాదేవీలు దాటిన ప్రతి వ్యాపారీ జీఎస్‌టీ కింద నమోదు కావాల్సి ఉంది. రెగ్యులర్‌ వ్యాపారులు ప్రతి నెలా రిటర్నులు దాఖలు చేయాల్సి ఉండగా కాంపొజిషన్‌ పరిధిలోని వ్యాపారులు త్రైమాసికానికి ఒకసారి రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంది. రాష్ట్ర పన్నుల శాఖ కాకినాడ డివిజన్‌ పరిధిలో కాకినాడ, జగన్నాయక్‌పూర్‌, పెద్దాపురం, రామచంద్రపురం, రాజమహేంద్రవరం, ఆర్యాపురం, అల్కాట్‌ గార్డెన్స్‌, అమలాపురం, అంబాజీపేట, మండపేట, తుని సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో పూర్తిస్థాయిలో అకౌంటెంట్లు అందుబాటులో లేకపోవడం ఇబ్బందికరంగా ఉంది. పెద్ద వ్యాపారులు కంప్యూటర్లు అందుబాటులో ఉంచుకుని అకౌంటెంట్లను నియమించుకోవడం ద్వారా వ్యాపార లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తున్నా చిన్న వ్యాపారులు ఆన్‌లైన్‌ రిటర్నుల దాఖలుకు వీటిని సమకూర్చుకునే స్థోమత లేక. రాజమహేంద్రవరం, కాకినాడ వంటి నగరాలకు వచ్చి ఆడిటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో అనేక వ్యయప్రయాసలకు గురవుతుండటంతో వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు అధిగమించే దిశగా ప్రస్తుతం ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రభుత్వం తాజాగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా. గ్రామ- వార్డు వాలంటీర్లను నియమించింది. సచివాలయ ఉద్యోగుల నియామక కసరత్తు జరుపుతోంది. ఈ క్రమంలోనే కామర్స్‌ చదివిన నిరుద్యోగులకు విద్యార్హత ప్రాతిపాదికన అకౌంటెంట్లుగా అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. జిల్లాలోని 64 మండలాల్లో వ్యాపార లావాదేవీలు, జీఎస్టీ పరిధిలోని రెగ్యులర్‌, కాంపొజిషన్‌ వ్యాపారులు.. రిటర్నుల దాఖలులో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై రాష్ట్ర పన్నులశాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. జిల్లా అవసరాలకు అనుగుణంగా 150 మంది అకౌంటెంట్లు కావాలని ప్రాథమికంగా ప్రభుత్వానికి నివేదిక పంపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నియామకాల దిశగా కసరత్తు జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఎంపిక చేసిన వారికి సెర్ఫ్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పిస్తారు. జీఎస్టీపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడంతో పాటు.. ఆన్‌లైన్‌ రిటర్నుల దాఖలు, ఇతర అంశాలపై అవగాహన కల్పించి క్షేత్రస్థాయిలో అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.