890 మంది గైర్హాజరు

రాజమహేంద్రవరంలో తమకు కేటాయించిన గదుల సంఖ్యలు చూసుకుంటున్న అభ్యర్థులు
నన్నయ విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం నగరం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్(ఏపీ సెట్) ఆదివారం రాజమహేంద్రవరం రీజియన్‌లోని ఆరు కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 5,259 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 4,369 మంది హాజరయ్యారని ఏపీ సెట్ రీజియన్ కోఆర్డినేటర్ ఆచార్య కె.శ్రీరమేష్ పేర్కొన్నారు. 890 మంది పరీక్షకు గైర్హాజరయ్యారని చెప్పారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో వెయ్యి మందికి గాను 859 మంది, ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో 879 మందికి గాను 766 మంది, గైట్‌లో 850 మందికి గాను 725 మంది పరీక్ష రాశారన్నారు. సూరంపాలెంలోని ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో 850 మందికి గాను 678 మంది, ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల(స్వయం ప్రతిపత్తి)లో 720 మందికి గాను 566 మంది, ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో 960 మందికి గాను 775 మంది హాజరయ్యారన్నారు. యూజీసీ అబ్జర్వర్ ఆచార్య తిలక్‌రాజ్ చౌహాన్, ఏపీ సెట్ స్టేట్ అబ్జర్వర్ ఆచార్య భార్గవ రామమోహనరావు అన్ని కేంద్రాలను తనిఖీ చేశారన్నారు. ఆయా కేంద్రాల వద్ద చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్షలను పర్యవేక్షించారన్నారు.