Latest Telugu News, Headlines, Breaking News, Articles
close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గుంటూరు: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని గుంటూరు పోలీసు కవాతు మైదానంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగం మరవలేనిదని కొనియాడారు. పోలీసు వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. గతంలో ఎవరూ చేయని విధంగా పోలీసు సంక్షేమానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. అమరవీరుల కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన