close

తాజా వార్తలు

ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు


అంబేడ్కర్‌ కాలనీలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌, తదితరులు

 

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: పెందుర్తి మండలం, జీవీఎంసీ వార్డుల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన 70వ వార్డు చినముషిడివాడ అంబేడ్కర్‌ కాలనీ, గుర్రమ్మపాలెం పంచాయతీ అక్కిరెడ్డిపాలెం గ్రామాల్లో పర్యటించారు. అంబేడ్కర్‌ కాలనీలో శాశ్వత నీటిట్యాంకు నిర్మించాలని, సీసీ రహదారులు, కాలువలు, సామాజిక భవనం, అంగన్‌వాడీ కేంద్రం నిర్మించాలని స్థానికులు విన్నవించారు. ఎమ్మెల్యే స్పందిస్తూ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు తయారుచేయాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వైకాపా నాయకుడు ముమ్మన దేముడు, జీవీఎంసీ డీఈ వర్మ, ఏసీపీ భాస్కర్‌, నీటి సరఫరా విభాగ ఏఈ రాజశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

● అనంతరం గుర్రమ్మపాలెం పంచాయతీ అక్కిరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే పర్యటించారు. గ్రామంలోని పారిశుద్ధ్య సమస్యను తక్షణమే పరిష్కరించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. మండల వైకాపా అధ్యక్షుడు నక్క కనకరాజు, నాయకులు ఉగ్గిన గోవింద్‌, ఇసరపు గోవింద్‌, ఉప్పిలి కనకరాజు పాల్గొన్నారు.

మల్లునాయుడుపాలెంలో పర్యటన

సబ్బవరం: సబ్బవరం మండలం మల్లునాయుడుపాలెంలో ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ సోమవారం పర్యటించారు. మురుగు, తాగునీటి వ్యవస్థలను పరిశీలించారు. త్వరలో ఇసుకను అందుబాటులోకి తెస్తామని, రాజన్న క్యాంటీన్లు, వైఎస్‌ఆర్‌ మొబైల్‌ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వీఆర్వోల సంఘం అధ్యక్షుడు ఎస్టీ రామకాసు, మండల పరిషత్‌ పరిపాలనా అధికారి బాబూరావు, తుంపాల అప్పారావు, కొటాన రాము తదితరులు పాల్గొన్నారు.

దర్జీల సమస్యలు పరిష్కరించాలని వినతి

ప్రహ్లాదపురం(వేపగుంట), న్యూస్‌టుడే : దర్జీల సమ్యస్యలను పరిష్కరించాలని ప్రహ్లాదపురం స్నేహమిత్ర దర్జీల సంఘం సభ్యులు సోమవారం ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సహకరించాలని కోరారు. 69వ వార్డు వైకాపా అధ్యక్షుడు దాసరి రాజు తదితరులు పాల్గొన్నారు.

●అగ్రిగోల్డ్‌లో రూ.10వేల లోపు డిపాజిట్‌ చేసిన వారికి నగదు చెల్లించడానికి ముఖ్యమంత్రి నిధులు విడుదల చేయడంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు కోటనరవ వైకాపా కార్యాలయాలంలో వార్డు అధ్యక్షుడు దాడి నూకరాజు ఆధ్వర్యంలో జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.