
తాజా వార్తలు
ఏడుగురికి తీవ్ర గాయాలు
క్షతగాత్రుల్లో 7 నెలల పసికందు
మృతుడు హరికృష్ణ, ఆస్పత్రిలో పసికందు తనీష్‌తో తల్లి దీనప్రియ
పూతలపట్టు, న్యూస్‌టుడే: పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిలోని పూతలపట్టు మండలం బందార్లపల్లె సమీపంలో బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా, ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. బస్సును క్వాలిస్ కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రుల్లో ఏడు నెలల పసికందు ఉన్నాడు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వివరాల మేరకు తమిళనాడులోని వాలాజీ తాలూకా మాన్దాంగళ్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు తొమ్మిది మంది సోమవారం తిరుమలకు వచ్చారు. మంగళవారం రాత్రి స్వామివారిని దర్శించుకున్నారు. సొంత వాహనం ఉన్నందున ఇంటికి వెళ్లిపోదామని బయలుదేరారు. బుధవారం తెల్లవారుజామున బందార్లపల్లె సమీపంలో తమిళనాడుకు చెందిన టూరిస్టు బస్సును ఎదురుగా ఢీకొన్నారు. కారులోని హరికృష్ణ (31), రాధ (36), అభినయ (17), రేణుక (18), దీనప్రియ (20), రేవతి (27), వల్లియమ్మల్ (61), తనీష్ (7 నెలలు) తీవ్రంగా గాయపడ్డారు. శశికళ (38) స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హరికృష్ణ మృతి చెందగా వల్లియమ్మల్ పరిస్థితి విషమంగా ఉంది. కొందరిని మెరుగైన చికిత్సకు వేలూరు సీఎంసీకి తరలించారు. వీరందరూ వల్లియమ్మల్ కుమారుడు, కోడలు, ఇద్దరు కూతుళ్లు, వాళ్ల కుమార్తెలు. కారు నడిపిన హరికృష్ణ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయ్యో తనీష్!
ప్రమాదంలో గాయపడిన ఏడు నెలల పసికందు తనీష్ ఏడుపు పలువురి హృదయాలను కలచివేసింది. సంఘటన స్థలంలో, ఆసుపత్రిలో అపరిచితులు కూడా పిల్లవాడి బాధను చూసి ఎత్తుకొని ఓదార్చే ప్రయత్నం చేశారు. రక్త గాయాలు కాకపోయినా ఎదపై తీవ్రనొప్పితో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. నొప్పి తగ్గడానికి ప్రథమచికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం సీఎంసీకి తరలించారు.
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- నాకు సంబంధం ఉందని తేలితే ఉరేసుకుంటా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
