
తాజా వార్తలు
నిందితుడిపై 80కి పైగా కేసులు : డీఎస్పీ బాషా

రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: అతడో ద్విచక్ర వాహన చోరుడు. అలాగని పెద్ద వాహనాల జోలికి వెళ్లడండోయ్. ఎందుకంటారా.. బైక్‌లు నడపడం రాదు. కేవలం గేర్లు లేని చిన్న వాహనం మాత్రమే నడుపుతాడు. కూలి పనికి వెళ్లి వస్తూ దారిలో మోపెడ్ కనిపిస్తే చాలు ఏదోలా అక్కడ్నుంచి పట్టుకుపోతాడు. ఏ యువకుడో ఈ పని చేస్తున్నాడనుకుంటే పొరపాటే. 50 ఏళ్లు నిండిన ఓ వ్యక్తి వ్యసనాలకు బానిసై ఈ మార్గం ఎంచుకున్నాడు. ఈ కేసుకు సంబంధించి రావులపాలెం పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అమలాపురం డీఎస్పీ షేక్ మాసూం బాషా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం తొక్కిరెడ్డిగూడేనికి చెందిన గుర్రం కృష్ణ 1993 నుంచి ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్నాడు. గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాలను దొంగతనాలు చేశాడు. ఆయా పోలీస్ స్టేషన్లలో అతనిపై 80 కేసులపైనే నమోదయ్యాయి. నేరాలు సైతం రుజువై జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఇటీవల జిల్లాలోని రావులపాలెం మండలంలోని పలు ప్రాంతాల్లో 13, పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో మూడు టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాలను దొంగతనం చేశాడు. ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసిన రావులపాలెం సీఐ వి.కృష్ణ, ఎస్సై బుజ్జిబాబు, అదనపు ఎస్సై శాస్త్రిలు జాతీయ రహదారిపై రావులపాడు వద్ద తనిఖీలు చేస్తుండగా కృష్ణ పట్టుబడడంతో అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 16 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.3.65 లక్షలు ఉంటుందని డీఎస్పీ చెప్పారు. త్వరితగతిన కేసును పూర్తిచేసినందుకు ఎస్పీ రావులపాలెం పోలీస్‌స్టేషన్‌కు రివార్డును కూడా అందించనున్నట్లు డీఎస్పీ తెలిపారు.
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- నిందితులు రాళ్లు,కర్రలతో దాడి చేశారు:సజ్జనార్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
