close

తాజా వార్తలు

రమేశ్‌ ఆస్పత్రికి గిన్నిస్‌ రికార్డు

విజయవాడ : విజయవాడలోని రమేశ్‌ హాస్పిటల్స్‌ గిన్నిస్‌ రికార్డుల్లోకి చేరింది. ఇప్పటివరకు 20వేల గుండె శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించి రమేశ్‌ హాస్పిటల్స్‌ ఈ ఘనత సాధించింది. హస్పిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా. పోతినేని రమేశ్‌బాబుకు గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు రికార్డుకు సంబంధించిన ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా శస్త్రచికిత్సలు చేయించుకున్న 1,020 మంది పేషెంట్లను ఒకే వేదికపైకి చేర్చి ఆస్పత్రి యాజమాన్యం గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ను స్వీకరించింది. ఈ కార్యక్రమానికి సినీహీరో రామ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా డా.రమేశ్‌ బాబు మాట్లాడుతూ.. మొత్తం 20వేల శస్త్ర చికిత్సల్లో 2 వేల మంది పిల్లలు ఉన్నారని వారంతా ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతున్నారని వెల్లడించారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.