close

తాజా వార్తలు

అక్రమ రవాణాపై విజిలెన్సు దాడులు


విజిలెన్సు అధికారులు స్వాధీనం చేసుకున్న వాహనాలు

 

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: ఖనిజం అక్రమ రవాణాపై విజిలెన్సు అధికారులు మెరుపు దాడులు చేశారు. పెనుకొండ, హిందూపురం ప్రాంతాల్లో బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అధిక బరువుతో ఖనిజం తరలిస్తున్న ఏడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను సీజ్‌ చేసి నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ దాడుల్లో సీఐలు శ్రీనివాసరెడ్డి, విశ్వనాథచౌదరి, సహాయ జియాలజిస్ట్‌ శివప్రసాద్‌, డీసీటీవో జిలాన్‌బాషా తదితరులు పాల్గొన్నారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.