close

తాజా వార్తలు

గుత్తేదారులపై చర్యలు తీసుకుంటాం..!

నాణ్యమైన కోడిగుడ్లు సరఫరా చేయాలి
 స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ సీతామహాలక్ష్మి


సమావేశంలో మాట్లాడుతున్న సీతామహాలక్ష్మి 

మాధవధార, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన కోడిగుడ్లను సరఫరా చేయాలని, లేకపోతే చర్యలు తప్పని గుత్తేదారులను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ సీతామహాలక్ష్మి హెచ్చరించారు. శనివారం ఆర్‌అండ్‌బీ వద్ద ఉన్న అర్బన్‌-1 ఐసీడీఎస్‌ కార్యాలయంలో ఐదు సెక్టార్ల అంగన్‌వాడీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రాల నుంచి సరఫరా చేస్తున్న కోడిగుడ్ల ఎలా ఉంటున్నాయో నేరుగా లబ్ధిదారులను అడిగి తెలుసుకోవాలని... ఆ నివేదికను సంబంధిత సీడీపీవోకు అందజేయాలని కార్యకర్తలకు సూచించారు. కేంద్రాలకు వచ్చే గర్భిణులకు, బాలింతలకు సరైన పోషకాహారం అందేలా చూడాలన్నారు. శుక్రవారం పాడైన గుడ్లను సరఫరా చేసిన గుత్తేదారులపై చర్యలు తీసుకుంటామన్నారు.


మినిట్స్‌ పుస్తకం ఉండాలి: అంగన్‌వాడీ కేంద్రాల్లో మినిట్స్‌ పుస్తకాన్ని ఏర్పాటు చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు నిత్యం ఎన్ని గంటలకు విధులకు హాజరవుతున్నారు...? తల్లిదండ్రులకు సమావేశం ఎప్పుడు నిర్వహిస్తున్నారు..? గుడ్లను ఏ సమయంలో సరఫరా చేస్తున్నారు..? ఏఏ సమయాల్లో అధికారులు పర్యవేక్షించారు...? వంటి వివరాలను పుస్తకంలో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో అర్బన్‌-1 సీడీపీవో ఎస్‌.పద్మావతి, సూపర్‌వైజర్లు మానస, రాజేశ్వరి, స్రవంతి, వరలక్ష్మి పాల్గొన్నారు. 


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.