close

తాజా వార్తలు

మహిళా నాయకత్వాన్నిప్రోత్సహించాలి

ఏయూ ప్రాంగణం: దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మహిళ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని శానసమండలి సభ్యులు పీఈఎన్‌ మాధవ్‌ అన్నారు. మంగళవారం ఏయూ క్రీడా మైదానంలో ‘మిషన్ సాహసి’ పేరిట ఏబీవీపీ ఆధ్వర్యంలో ఝాన్సీలక్ష్మీబాయి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం మహిళా శక్తి అన్ని రంగాలలో రాణిస్తుందని, ఇదే సమయంలో మహిళలపై దాడులు  విచారకరమని అన్నారు. కేవలం చట్టాల ద్వారా మాత్రమే మార్పు రాదన్నారు. మహిళల ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్‌ని పాఠ్యాంశంగా రూపొందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణ మోహన్, ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.