close

తాజా వార్తలు

150 భవనాలకు రంగులేశారు

ఒక్కో భవనానికి ఖర్చు రూ. 50 వేలు

ఏఎస్‌ఆర్‌ నగర్‌లో వైకాపా వర్ణాలతో సచివాలయం

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: జీవీఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాల్లో ఇప్పటి వరకు 150 భవనాలకు వైకాపా రంగులేశారు. మిగిలినవాటికి త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నగరంలో 572 వార్డు సచివాలయాలున్నాయి. ఇందులో 270 అద్దె భవనాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలు, సామాజిక భవనాల్లో కొన్నింటిని ఏర్పాటు చేశారు.

●*ఒక్కో భవనానికి రంగులు వేయడానికి జీవీఎంసీ రూ. 50 వేలు వెచ్చించింది. వార్డు సచివాలయాల్లో మౌలిక వసతుల కల్పన బాధ్యత ప్రభుత్వానిదేనని మొదట ప్రకటించినప్పటికీ, తరువాత స్థానిక సంస్థలే చూసుకోవాలన్న ఆదేశాలతో మహా విశాఖ నగరపాలక సంస్థ ఆయా పనులను చేపట్టింది. కుర్చీలు, కంప్యూటర్లు, బెంచీలను కూడా సమకూరుస్తోంది. ● అద్దె ప్రాతిపదికన తీసుకున్న 270 భవనాలకు రంగులు వేసే బాధ్యతను వాటి యజమానులకే అప్పగించారు. ఈ మొత్తాన్ని తరువాత జీవీఎంసీ చెల్లిస్తుంది.

●*వార్డు సచివాలయాలకు రాజకీయ పార్టీ రంగులు వేయండంపై తాజాగా హైకోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటామని అధికారులు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు

 


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.