3 నుంచిఉచిత రేషన్‌..
close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
3 నుంచిఉచిత రేషన్‌..

వన్‌టౌన్‌: రేషను కార్డుదారులకు ఈ నెలలో కూడా ఉచితంగా రేషన్‌ పంపిణీ చేయనున్నట్లు జిల్లా సరఫరా అధికారి ఆర్‌.శివప్రసాద్‌, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజరు పి.వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. కుటుంబానికి కిలో కందిపప్పు, కుటుంబ సభ్యునికి 5కిలోల చొప్పున బియ్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. అరకిలో పంచదార రూ.17కు ఇవ్వనున్నామని చెప్పారు. ఈనెల 3 నుంచి సరకుల పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. పీఎం గరీభ్‌ కల్యాణ్‌ యోజన పథకంలో భాగంగా జులై నెల రేషన్‌ ఉచితంగా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన