close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రేమలో గెలిచి.. జీవితంలో ఓడి..

పెళ్లైన 3 నెలలకే యువజంట బలవన్మరణం

నేననీ.. నీవనీ.. వేరుగా లేమనీ.. ప్రేమ కోసం పెద్దలను ఎదిరించారు నేను నీ నీడని.. నువ్వు నా నిజమని పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు జీవితాంతం కలిసి ఉంటామని.. ఒకే మాట.. ఒకే బాటని బాస చేశారు కాపురంలో మనస్పర్థలతో కలత చెందారు కలహాలతో సాగలేక.. కన్నీళ్లతో వేగలేక.. జీవితాన్ని గెలవలేక.. కలిసే వెళ్లిపోయారు.

ధర్మవరం, న్యూస్‌టుడే: ధర్మవరం పట్టణం లక్ష్మీచెన్నకేశవపురం కాలనీకి చెందిన శివశంకర్‌(25) డిగ్రీ వరకు చదివాడు. గాంధీనగర్‌కు చెందిన గౌతమి (23) ఎంబీఏ చదివింది. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరి నేపథ్యాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. వారిని ఎదిరించి 3 నెలల కిందట పట్టణంలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన తర్వాత శివశంకర్‌ ఇంట్లోనే ఉంటున్నారు. ఇదిలా ఉండగా తండ్రి మల్లికార్జున బదులు శివశంకర్‌ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తుండేవాడు. కొన్ని రోజుల కిందట యువ దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. ఈ విషయం గౌతమి తల్లిదండ్రులు శోభ, చంద్రశేఖర్‌కు తెలియడంతో కుమార్తెను, అల్లుడిని ఇంటికి పిలిచి నచ్చజెప్పారు. మంగళవారం రాత్రి పుట్టింట్లో ఉన్న గౌతమి వద్దకు శివశంకర్‌ వెళ్లాడు. భోజనం అనంతరం వారి మధ్య మరోసారి విభేదాలు వచ్చాయి. అర్ధరాత్రి ఫ్యాన్‌కు చీర బిగించి గౌతమి ఆత్మహత్య చేసుకుంది. అదే గదిలో నిద్రిస్తున్న శివశంకర్‌ చప్పుడు విని లేచి చూసే సరికి గౌతమి ఉరితాడుకు వేలాడుతుండడం గమనించి అత్తమామలకు విషయం తెలిపాడు. అక్కడి నుంచి బయటకు వెళ్లిన అతను లక్ష్మీచెన్నకేశవపురం వద్ద రైలు కిందపడి బలవన్మరణం చెందాడు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. గౌతమి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. శివశంకర్‌ ఆత్మహత్య చేసుకున్న ప్రాంతం హిందూపురం రైల్వేపరిధిలో ఉండడంతో హిందూపురం రైల్వేపోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.