close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
హెచ్చెల్సీ కాలువల ఆధునికీకరణకు సర్వే

అధికారులతో సమీక్షిస్తున్న సీఈ నాగరాజు

అనంతపురం(శ్రీనివాస్‌నగర్‌): ‘జిల్లాకు హెచ్చెల్సీ కీలకం. వచ్చే నెలలో నీరు విడుదలయ్యే అవకాశం ఉంది. అన్ని కాలువల పటిష్టతపై క్షేత్ర సర్వే చేయండి. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలని’ జిల్లా జలవనరుల శాఖ సీఈ నాగరాజు పేర్కొన్నారు. సోమవారం తన కార్యాలయంలో హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్‌తో కలిసి అత్యవసర సమీక్ష జరిపారు. తొలుత హెచ్చెల్సీ కాలువలు, ఆధునికీకరణ, మరమ్మతులు, నీటి కేటాయింపులు తదితర అంశాలపై తెలుసుకున్నారు. ఈ దఫా తుంగభద్రలో 163 టీఎంసీలు లభ్యమయ్యే అవకాశం ఉంది. ఇందులో హెచ్చెల్సీ వాటాగా 24.98 టీఎంసీల నీరు విడుదల అవుతుందని ఎస్‌ఈ తెలిపారు. ప్రధాన కాలువ ఆధునికీకరణ వ్యవహారం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. దక్షిణ కాలువ, జీబీసీ ఆధునికీకరణ పనులు చేసేందుకు చర్యలు మొదలు పెట్టామన్నారు. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు ఎస్‌ఈ తెలియజేశారు. ఈ సమావేశంలో ఈఈలు పాండురంగారావు, సురేష్‌బాబు, శ్రీనివాసులు, డీఈ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన