close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
2000 దాటాయ్‌...!

● 5 రోజుల్లోనే 500 కేసులు

● 24 గంటల్లో 142 మందికి పాజిటివ్‌

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 1000 నుంచి 1500 కేసులకు చేరడానికి ఆరు రోజులు పట్టగా.. 1500 నుంచి 2000 కేసులు అయిదు రోజుల్లోనే నమోదయ్యాయి. సోమవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రికార్డు స్థాయిలో 142 మందికి పాజిటివ్‌గా తేలింది. 24 గంటల వ్యవధిలో ఇన్ని కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి. అత్యధికంగా తిరుపతి నగరంలో 71, పుంగనూరు 12, చిత్తూరు నగరం 10, నగరి 9, తిరుపతి గ్రామీణ 4, చంద్రగిరి, మదనపల్లె, పులిచెర్ల, రేణిగుంట, వడమాలపేటలో రెండేసి, బంగారుపాళ్యం, గంగాధరనెల్లూరు, నిండ్ర, పలమనేరు, పెద్దమండ్యం, పుత్తూరు, సత్యవేడు, సోమల, శ్రీకాళహస్తి, వరదయ్యపాళెం, వెదురుకుప్పం, విజయపురం, ఏర్పేడు మండలాల్లో ఒక్కొక్కరు, ఇతర జిల్లాల వాసులు 13 మందికి కొవిడ్‌ సోకింది. పెద్దమండ్యంలో ఆరేళ్ల చిన్నారి వైరస్‌ బారిన పడింది. తిరుపతిలో వచ్చిన కేసుల్లో ఎక్కువ మంది తితిదే ఉద్యోగులు ఉన్నారు. 142 కేసులతో కలిపి.. మొత్తం 2,013 మందిలో లక్షణాలు కనిపించాయి.

రాత్రికి మరో 73 కేసులు

సోమవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి వరకు 73 కేసులు నమోదయ్యాయి. తిరుపతి నగరం లో 33, పుత్తూరు, నిండ్రలో ఏడేసి, మదనపల్లె, పాలసముద్రం, రామకుప్పం, శ్రీకాళహస్తి, తవణంపల్లె మండలాల్లో రెండేసి, చంద్రగిరి, నాగలాపురం, చిత్తూరు నగరం, నగరి, పులిచెర్ల, సత్యవేడు, వెదురుకుప్పం మండలాల్లో ఒక్కో కేసు, ఇతర జిల్లాల వాసులు 9 మందిలో లక్షణాలు బయటపడ్డాయి. 73 కేసులతో కలుపుకొని సోమవారం రాత్రికి 2,086 పాజిటివ్‌లు వచ్చాయి. 945 మంది డిశ్ఛార్జి కాగా.. 1,129 యాక్టివ్‌ కేసులున్నాయి.

87 మంది డిశ్ఛార్జ్‌

జిల్లా కొవిడ్‌ ఆస్పత్రి-2(రుయా) నుంచి 75 మంది, రాష్ట్ర కొవిడ్‌ ఆస్పత్రి(స్విమ్స్‌) నుంచి జిల్లాకు చెందిన 10 మంది, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన ఇద్దరిని సోమవారం డిశ్ఛార్జ్‌ చేశారు.

రాష్ట్ర కొవిడ్‌ ఆస్ప్రతిలో ముగ్గురి మృతి

రాష్ట్ర కొవిడ్‌ ఆస్పత్రి(స్విమ్స్‌)లో ఇద్దరు కరోనా రోగులు, అనుమానిత లక్షణాలు ఉన్న ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్విమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ భూమా వెంగమ్మ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం 7 గంటల వరకు కడప జిల్లాకు చెందిన మహిళ (67), చిత్తూరు జిల్లా సోమల మండలానికి చెందిన వ్యక్తి(73) మృతి చెందినట్లు తెలిపారు. సదుం మండలానికి చెందిన వ్యక్తి (68) అనుమానిత లక్షణాలతో మృతి చెందారని కొవిడ్‌ పరీక్ష ఫలితాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు.

 


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.