ఇసుకను అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్టు
close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఇసుకను అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్టు


ఇసుక అక్రమ తరలింపు కేసులో అరెస్టు చేసిన వ్యక్తులతో సీఐ లక్ష్మణరెడ్డి

రాజమహేంద్రవరం నేరవార్తలు: ఏపీఎండీసీ శాఖలో పనిచేస్తున్న కొంత మంది పొరుగుసేవల సిబ్బంది, దళారులతో కలిసి ఇసుకను బల్కులో బుకింగ్‌ చేసి నల్లబజారులో సొమ్ము చేసుకుంటున్న ఏడుగురు వ్యక్తులను బొమ్మూరు పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. సీఐ లక్ష్మణ్‌రెడ్డి వివరాల ప్రకారం... గత నెల 27వ తేదీన దివాన్‌చెరువు జాతీయరహదారి మార్గంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు రాజమహేంద్రవరం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) అధికారులకు సమాచారం వచ్చింది. ఈ క్రమంలో 54 మెట్రిక్‌ టన్నుల ఇసుకను అక్రమంగా మూడు లారీల్లో తరలిస్తుండగా పట్టుకున్నారు. వాటితోపాటు పవన్‌కుమార్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని బొమ్మూరు పోలీసులకు అప్పగించారు. విచారణలో మొత్తం 21 మందిని నిందితులుగా గుర్తించామని, వారిలో మణికంఠ, చంద్రశేఖర్‌, నాగ వెంకటేశ్వరరావు, రామకృష్ణ, శ్రీకేశవ, కాశీ విశ్వనాథ్‌, పి.మణికంఠ అనే ఏడుగురు వ్యక్తులను బుధవారం అరెస్టు చేశామని సీఐ చెప్పారు. దర్యాప్తులో విజయవాడకు చెందిన ఆదిత్య, మణికుమార్‌, కాకినాడకు చెందిన కాశీ విశ్వనాథ్‌, ఏపీఎండీసీలో పనిచేస్తున్న పలువురు పొరుగుసేవల సిబ్బందితో కలిసి జీఎస్టీ పేరుపై నకిలీ పత్రాలు సృష్టించి, బల్కు మొత్తంలో ఇసుకను నల్లబజారుకు తరలిస్తున్నట్లు తేలిందని, వీరు ప్రభుత్వం నుంచి ఒక మెట్రిక్‌ టన్ను ఇసుకను రూ.375 కొనుగోలు చేసి నల్లబజారులో రూ.550 నుంచి రూ.700 వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆయన వివరించారు.


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన