close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మార్కెట్‌కు పట్టుకొచ్చారు

ఒకేరోజు 5,580 కేజీల పట్టుగూళ్లు

ల్యాట్‌లు చాలక మార్కెట్‌లో కింద పరచిన సరకు

మదనపల్లె(గ్రామీణ): స్థానిక ప్రభుత్వ పట్టుగూళ్ల విక్రయ కేంద్రానికి ఎన్నడూ లేని విధంగా రైతులు సోమవారం ఐదున్నర టన్నుల పట్టుగూళ్లను తీసుకొచ్చారు. మదనపల్లె మార్కెట్‌లో గత 15 ఏళ్లుగా 2 టన్నులకు మించి పట్టుగూళ్లు రాలేదు. గతనెల 15న తొలిసారి అత్యధికంగా 5,143 కేజీల పట్టుగూళ్లను రైతులు తీసుకొచ్చారు. సోమవారం మదనపల్లె, బంగారుపాళ్యం, బైరెడ్డిపల్లె, పుంగనూరు, పెద్దపంజాణి, తంబళ్లపల్లె తదితర ప్రాంతాల నుంచి 5,580 కేజీలు వచ్చాయి. ఈ నామ్‌ ద్వారా చేపట్టే వేలంలో విక్రయదారుడికి అనుకూలమైన ధరల పలకకపోయినప్పుడు మూడుసార్లు లేదా నాల్గోసారి కూడా అధికారులు బిడ్డింగ్‌ నిర్వహిస్తున్నారు. దాంతో ఈ మార్కెట్‌వైపు రైతులు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. సీబీ రకం ఎక్కువగా తీసుకొచ్చేవారు. ప్రస్తుతం బైవోల్టేన్‌ రకాన్ని తెస్తున్నారు.

 


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.