close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గంటాకు వ్యతిరేకంగా వైకాపా శ్రేణుల ఆందోళన

విశాఖపట్నం: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైకాపాలో చేరనున్నారనే ప్రచారం నేపథ్యంలో అధికార పార్టీ శ్రేణులు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాయి. గంటాను పార్టీలో చేర్చుకోవద్దంటూ నిరసనకు దిగారు. చిన్నాపురం, తగరపు వలస, వీఎం పాలెం వద్ద గంటాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైకాపా అధిష్ఠానం కార్యకర్తల మనోభావాలు గుర్తించాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. భీమిలి నియోజకవర్గంలోని కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
 వైకాపాలోకి గంటా రాకను విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మీడియా ద్వారా బహిరంగంగానే ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 2014 ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, అవంతి శ్రీనివాస్‌ అనకాపల్లి ఎంపీగా తెదేపా నుంచే పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అవంతి శ్రీనివాసరావు వైకాపాలో చేరి భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ  చేసి గెలుపొందారు. ఆ తర్వాత మంత్రి అయ్యారు.


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.