close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఏబీసీడీ... ఛేదనలో మేటి

19 మంది జిల్లా పోలీసులకు అవార్డులు

రాష్ట్ర పోలీసు కార్యాలయం వద్ద అవార్డులతో జిల్లా పోలీసులు

న్యూస్‌టుడే, నెల్లూరు (వీఆర్సీ సెంటరు), దగదర్తి: ఉత్తర భారతానికి చెందిన ఓ గ్యాంగ్‌ జిల్లాలో మొబైల్‌ ఫోన్ల కంటెయినర్‌ను దోచుకుంది. కేసులో ఎలాంటి ఆధారాలు లేవు. రూ. అయిదు కోట్ల సరకు.. కరడు గట్టిన కంజర భట్స్‌.. జిల్లా పోలీసులు ఏ మాత్రం జంకలేదు. కొన్ని నెలలు కష్టపడ్డారు. ఏడు రాష్ట్రాలు తిరిగారు. ఎట్టకేలకు వారిని పట్టుకోగలిగారు. గత ఏడాది ఫిబ్రవరి 2న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ఛేదించి.. రాష్ట్ర పోలీసుశాఖ అందించే ఏబీసీడీ అవార్డుల్లో జిల్లాను రెండో స్థానంలో నిలిపారు. బుధవారం రాష్ట్ర పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చేతుల మీదుగా జిల్లాకు చెందిన 19 మంది పోలీసులు అవార్డు అందుకున్నారు.

అవార్డు గ్రహీతలు వీరే..

నాటి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగితో పాటు ఇన్‌స్పెక్టర్లు పి.అక్కేశ్వరరావు, బి.సురేష్‌బాబు, ఎస్‌కే ఫైరోజ్‌, ఎస్‌కే బాజీజాన్‌ సైదా, ఎస్సైలు ఎస్‌జే హుస్సేన్‌, జి.సుబ్బారావు, ఎం.బాబి, జేపీ శ్రీనివాసులురెడ్డి, జి.అంకమ్మ, సైబర్‌ క్రైమ్స్‌ ఎస్సై ఎ.సురేష్‌ బాబు, ఏఎస్సై ఎం.శ్రీనివాసులు రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ ఆర్‌.వెంకటేశ్వర రాజు, కానిస్టేబుళ్లు పి.ఆదినారాయణ, పి.చెన్నకేశవ, కె.జయచంద్ర, డి.నవీన్‌ విజయకృష్ణ, సీహెచ్‌ కృష్ణకిషోర్‌, ఏఆర్‌ కానిస్టేబుల్‌ సీహెచ్‌ కృష్ణప్రసాద్‌ అవార్డు అందుకున్నవారిలో ఉన్నారు.

 


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.