close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆశపడి.. వలలో చిక్కి  


నగదుతో డీటీ శ్రీనివాసరావు

 

కలకడ, న్యూస్‌టుడే: ఎరువుల దుకాణ యజమాని నుంచి రూ.3 వేలు లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు కలకడ డిప్యూటీ తహసీల్దారు శ్రీనివాసరావు పట్టుబడ్డాడు. తిరుపతి ఏసీబీ డీఎస్పీ అల్లాబక్షు కథనం ప్రకారం... కలకడలోని ఇక్బాల్‌ ఎరువుల దుకాణాన్ని గత సంవత్సరం జులై 15న విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేసి అక్రమంగా నిల్వ చేసిన 228 బస్తాల ఎరువులను సీజ్‌ చేశారు. వాటిని జిల్లా సివిల్‌సప్లై అధికారులకు స్వాధీనం చేయడంతో వారు సంబంధిత అథరైజ్డ్‌ డీలరుతో ఎరువులను విక్రయించగా వచ్చిన రూ.1,96,390ను ట్రెజరీ ద్వారా బ్యాంక్‌లో జమచేశారు. 15 శాతం అపరాధ రుసుంగా రూ.29,458 ప్రభుత్వానికి చెల్లించి, మిగిలిన రూ.1,66,932 ఎరువుల దుకాణం యజమాని సుగ్బుతుల్లాకి 15 రోజుల్లో చెల్లించాలని జిల్లా సివిల్‌సప్లై కోర్టు ఆదేశించింది. కలకడ మండల రెవెన్యూ అధికారులకు సంబంధిత రికార్డులు పంపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి యజమాని సుగ్బుతుల్లాకు ఆ డబ్బును చెల్లించకపోగా తిప్పుకొంటున్నారు. ఈ విషయమై కలకడ డిప్యూటీ తహసీల్దారు శ్రీనివాసరావు రూ.10వేలు లంచం డిమాండ్‌ చేయగా.. రూ.3వేలు ఇస్తానని మాట్లాడుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో డీటీ శ్రీనివాసరావు సుగ్బుతుల్లా నుంచి గురువారం ఆ మొత్తం తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు నేరుగా పట్టుకున్నారు. దాడిలో ఏసీబీ సీఐ ప్రసాద్‌రెడ్డి, ఎస్సై విష్ణు పాల్గొన్నారు.


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.