close

ప్రధానాంశాలు

మయాంతి: అక్కడ స్ట్రైకర్‌... ఇక్కడ హోస్ట్‌

టీమిండియా క్రికెట్‌ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు... హోస్ట్‌గా ఓ మహిళ కనిపిస్తుంది. గలగల మాట్లాడుతూ భలే యాక్టివ్‌గా ఉంటుంది. దిగ్గజ క్రికెటర్లతో మాట్లాడుతూ భలే విషయాలను చెబుతుంటుంది. ఆమెనే మయాంతి లాంగర్‌. ఆమె ఎవరు అంటే... క్రికెటర్‌ స్టువర్ట్‌ బిన్ని భార్య. మరి ఆమె గురించి వివరంగా తెలియాలంటే... ఈ కథనం చదవాల్సిందే!

సంజీవ్‌ లాంగర్‌, ప్రమీంద లాంగర్‌కు మయాంతి 1985, ఫిబ్రవరి 8న దిల్లీలో జన్మించింది. మయాంతి తండ్రి అమెరికాలో పనిచేస్తుండటంతో చిన్నతనమంతా అక్కడే గడిపింది. తర్వాత దిల్లీలోని తన నాన్నమ్మ ప్రియో బట్రా, తాతయ్య లెఫ్టినెంట్ జనరల్‌ రాజింద్ర నాథ్‌ బట్రా దగ్గర పెరిగింది.


దిల్లీలోని హిందూ కాలేజీలో మయాంతి బీఏ పూర్తి చేసింది. చిన్నతనం నుంచే ఫుట్‌బాల్‌ అంటే మయాంతికి ఆసక్తి. ఆ రోజుల్లోనే సూపర్‌ సాకర్‌ అకాడమీలో శిక్షణ పొందింది. ఆమె కాలేజీ ఫుట్‌బాల్‌ టీమ్‌లో స్ట్రైకర్‌. గ్రాఫిక్‌ డిజైనర్‌గా అవ్వాలనుకున్న మయాంతి ‘ఫిఫా బీచ్‌ ఫుట్‌బాల్’తో స్పోర్ట్స్‌ యాంకర్‌గా మారాలని నిర్ణయించుకుంది.


ఫిఫా బీచ్‌ ఫుట్‌బాల్‌లో గెస్ట్ యాంకర్‌గా మయాంతి పని చేసింది. అనంతరం స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానెల్‌ నుంచి హోస్ట్‌గా అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా తన ప్రతిభని అందరికి తెలిసేలా చేసింది. నెహ్రూ కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ, ఇండియన్‌ క్రికెట్‌ లీగ్‌ (ఐసీఎల్‌)కు కూడా ఆమె హోస్ట్‌గా చేసింది.


మయాంతి ఎన్నో మెగా టోర్నీలకు యాంకరింగ్‌ చేసింది. 2010 కామన్‌వెల్త్‌, 2010 ఫిఫా వరల్డ్‌కప్‌, 2014 ఇండియన్‌ సూపర్‌ లీగ్‌, 2018 ఐపీఎల్‌, 2011, 2015 ప్రపంచకప్‌లలో హోస్ట్‌ చేశారు.


భారత క్రికెటర్‌ స్టువర్ట్‌ బిన్నీని మయాంతి 2012 సెప్టెంబర్‌లో వివాహం చేసుకుంది. భారత క్రీడాకారులు, క్రికెట్‌ అభిమానులు ఈ జంట గురించే గొప్పగా మాట్లాడుకుంటారు. మా బంధాన్ని క్రికెటే మరింత బలంగా చేసిందని ఈ జంట చెప్తుంటుంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net