close

ప్రధానాంశాలు

అత్యధిక డాట్‌బాల్స్‌ విసిరిందెవరు?

హైదరాబాద్‌: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ 12వ సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. బ్యాటర్లు, బౌలర్ల మధ్య మ్యాచ్‌ మ్యాచ్‌కు పోరు రసవత్తరం అవుతోంది. బంతి దొరికితే బౌండరీ లేదంటే భారీ సిక్సర్‌ బాదాలని బ్యాట్స్‌మెన్‌ కసిగా ఎదురుచూస్తున్నారు. ఇక బౌలర్లేమో విసిరే ప్రతి బంతికి వికెట్‌ తీయాలని కోరుకుంటున్నారు. కనీసం పరుగులు ఇవ్వకుండా బంతులు వృథా అయ్యేలా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 12వ సీజన్‌తో కలిపి ఎంతోమంది బౌలర్లు కొన్ని వందల వృథా బంతులు (డాట్‌బాల్స్‌) విసిరారు. అందులో ఏయే ఆటగాళ్లు ఎక్కువ బంతులు విసిరారంటే..


హర్భజన్‌ సింగ్‌

డాట్‌ బాల్స్‌: 1,153
జట్టు: చెన్నై సూపర్‌ కింగ్స్‌
మ్యాచ్‌లు: 151
పరుగులు (ఇచ్చినవి): 3,705
ఓవర్లు: 526.2
ఎకానమీ: 7.03


ప్రవీణ్‌ కుమార్‌

డాట్‌ బాల్స్‌: 1075
జట్టు: గుజరాత్‌ లయన్స్‌ (రిటైర్‌)
మ్యాచ్‌లు: 119
పరుగులు: 3,251
ఓవర్లు: 420.4
ఎకానమీ: 7.72


లసిత్‌ మలింగ

డాట్‌ బాల్స్‌: 1071
జట్టు: ముంబయి ఇండియన్స్‌
మ్యాచ్‌లు: 112
పరుగులు: 2,999
ఓవర్లు: 433.2
ఎకానమీ: 7.41


అమిత్‌ మిశ్రా

డాట్‌ బాల్స్‌: 1,046
జట్టు: దిల్లీ క్యాపిటల్స్‌
మ్యాచ్‌లు: 138

పరుగులు: 3,596
ఓవర్లు: 484.5
ఎకానమీ: 7.41


పియూష్‌ చావ్లా

డాట్‌ బాల్స్‌: 1,041
జట్టు: కోల్‌కతా నైట్‌రైడర్స్‌
మ్యాచ్‌లు: 147

పరుగులు: 3,758
ఓవర్లు: 486.1
ఎకానమీ: 7.72


రవిచంద్రన్‌ అశ్విన్‌

డాట్‌ బాల్స్‌: 995
జట్టు: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌
మ్యాచ్‌లు: 129
పరుగులు: 3,034
ఓవర్లు: 448.2
ఎకానమీ: 6.76


భువనేశ్వర్‌ కుమార్‌

 

డాట్‌బాల్స్‌: 980
జట్టు: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
మ్యాచ్‌లు: 105

పరుగులు: 2810
ఓవర్లు: 387.2
ఎకానమీ: 7.25


గమనిక: ఈ గణాంకాలన్నీ 02/04/2019 వరకు మాత్రమే..

 



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net