close

ప్రధానాంశాలు

మన్కడింగ్‌ తప్పించుకునేందుకు.. కొత్త ఉపాయం

ట్విటర్‌లో వైరల్‌గా మారిన వీడియో

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌లో మన్కడింగ్‌ నుంచి తప్పించుకోవాలంటే ఓ వినూత్న ఉపాయం తెరపైకి వచ్చింది. అదేంటంటే నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌ పొడవాటి కర్రను(బ్యాట్‌) పట్టుకొని పరిగెడితే సరిపోతుంది. బ్యాట్స్‌మన్‌ షాట్‌ ఆడాక నాన్‌స్ట్రైకర్‌ పరుగులు తియ్యకుండా పిచ్‌ సగంలో నిలబడి కర్రను అటూ ఇటూ తిప్పితే సరిపోతుంది. అలా చెయ్యడం ద్వారా కష్టపడకుండానే పరుగులు తీయడంతోపాటు బౌలర్‌కు మన్కడింగ్‌ చేసే అవకాశం దక్కదు. ప్రస్తుతం ఇలాంటి వీడియోనే ఒకటి ట్విటర్‌లో వైరల్‌గా మారింది. చిన్నపిల్లలు ఆడుతున్న క్రికెట్‌లో మన్కడింగ్‌ నుంచి తప్పించుకునేందుకు నాన్‌స్ట్రైకర్‌లో ఉన్న వ్యక్తి పెద్ద కర్రను అవతలి క్రీజుకు, ఇవతలి క్రీజుకు తిప్పుతూ కనిపించాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది.

కాగా ఇటీవల ఐపీఎల్‌లో మన్కడింగ్‌ వివాదం క్రికెట్‌లో చిన్నపాటి దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ జాస్‌ బట్లర్‌ను మన్కడింగ్‌ చేశాడు. దీంతో ఈ విధానంపై క్రికెట్‌ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చివరికి మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) మన్కడింగ్‌ క్రికెట్‌లో తప్పనిసరని చెప్పింది. ఈ పద్ధతి లేకపోతే బౌలర్‌ బంతి వేయకముందే.. నాన్‌స్ట్రైకర్‌ ముందుకు వెళ్తాడని అది బ్యాటింగ్‌ చేసే జట్టుకు అనుకూలంగా మారుతుందని వివరించింది.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net