close

ప్రధానాంశాలు

ఈ ఓటమి ఓ మేల్కొలుపు : రైనా

హైదరాబాద్‌ : ఉప్పల్‌ మైదానం వేదికగా సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌లో చెన్నై ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. చెన్నై ఖాతాలో రెండో ఓటమి వచ్చి చేరింది. దీంతో వరుస విజయాలతో ఉన్న చెన్నైకి సడన్‌ బ్రేక్‌ పడినట్లయింది. ధోని గైర్హాజరీలో జట్టుకు సారథ్యం వహించిన సురేశ్‌ రైనా ఈ ఓటమిపై స్పందించాడు. 
‘ఈ ఓటమి మేల్కొలుపు లాంటిది. మేం ఇంకా పెద్ద లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు నిర్దేశించి ఉండాల్సింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో కానీ అది సాధ్యం కాలేదు. డుప్లెసీస్‌, వాట్సన్‌ మంచి ఆరంభం ఇచ్చారు. కానీ, దాన్ని మేం సరిగా వినియోగించుకోలేకపోయాం. కీలకమైన సమయంలో వికెట్లు కోల్పోయాం. స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పాల్సి ఉంది. అనుకున్న దాని కంటే 30 పరుగులు తక్కువే చేశాం. అనుకున్న లక్ష్యాన్ని నిర్దేశించి ఉంటే మ్యాచ్‌ రసవత్తరంగా ఉండేది’ అని రైనా పేర్కొన్నాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో నడుం నొప్పితో ఇబ్బంది పడ్డ ధోని హైదరాబాద్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో సారథ్య బాధ్యతలను రైనా తీసుకున్నాడు. ప్రస్తుతం ధోని ఫిట్‌గా ఉన్నాడు. వచ్చే మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడని రైనా తెలిపాడు.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net