close

ప్రధానాంశాలు

ముంబయి మ్యాచ్‌కు ముందు దిల్లీకి శ్రేయస్‌ భయం

దిల్లీ: ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు దిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ! ఆ జట్టు సారథి శ్రేయస్‌ అయ్యర్‌ గాయపడ్డాడు. నెట్స్‌లో బుధవారం సాధన చేస్తుండగా అతడి కుడి భుజానికి బంతి బలంగా తగిలింది. ఈ నేపథ్యంలో అతడు ముంబయితో మ్యాచ్‌లో ఉంటాడో లేదో స్పష్టత లేదు. జట్టు యాజమాన్యం సైతం అతడి గాయం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. 

ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అతడు 33.25 సగటుతో 266 పరుగులు చేశాడు. దిల్లీ తరఫున అత్యధిక పరుగులు చేసిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రపంచకప్‌నకు ఎంపికవ్వని రిషభ్‌పంత్‌ కఠోర సాధన చేశాడు. చివరి ఐదు ఇన్నింగ్సుల్లో ప్రభావం చూపని ఓపెనర్‌ పృథ్వీషా ఆ జట్టు సలహాదారు సౌరవ్‌ గంగూలీతో సుదీర్ఘంగా మాట్లాడాడు. దిల్లీ ఫ్రాంచైజీ చివరి సారిగా 2012లో ప్లేఆఫ్స్‌లో ఆడింది. ఈ సారి ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఐదు గెలిచి 10 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్‌కు అర్హత సాధించేలా కనిపిస్తోంది. 



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net