close

ప్రధానాంశాలు

ఐపీఎల్‌లో ఆ ఇద్దరి బౌలింగ్‌ బాగుంది: బ్రెట్‌లీ

ముంబయి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రస్తుత సీజన్‌లో యువ పేసర్లు ప్రసిధ్‌ కృష్ణ, నవ్‌దీప్‌ సైనీ బౌలింగ్‌ తననెంతో ఆకట్టుకుందని ఆసీస్‌ మాజీ స్పీడ్‌స్టర్‌ బ్రెట్‌లీ అన్నాడు. భారత్‌లో యువ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారని వెల్లడించాడు. ‘ఐపీఎల్‌లో ప్రసిధ్‌ కృష్ణ 145 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతున్నాడు. అలాంటి మరో బౌలరే నవ్‌దీప్‌ సైనీ. ప్రస్తుతం భారత్‌లో మంచి పేసర్లు ఉన్నారు. జస్ప్రీత్‌ బుమ్రా తరహా పేసర్లు బయటకు రావడం భారత క్రికెట్‌కు సానుకూల పరిణామం’ అని బ్రెట్‌ లీ అన్నాడు.

‘ప్రస్తుతమున్న భారత బౌలర్లు మంచి వేగంతో బంతులు వేస్తుండటం సంతోషకరం. కొందరు భారత బౌలర్లు 145 కిలోమీటర్ల అడ్డంకినీ అధిగమిస్తుండటం మనం చూస్తున్నాం. భారత క్రికెట్‌కు ఇది ఉత్సాహకరం’ అని బ్రెట్‌లీ అన్నాడు. ప్రసిధ్‌కృష్ణ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పేస్‌ భారం మోస్తున్నాడు. రెండు వికెట్లే తీసినప్పటికీ చక్కని బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. దిల్లీతో సూపర్‌ ఓవర్‌కు దినేశ్‌ కార్తీక్‌ అతడినే ఎంపిక చేయడం గమనార్హం. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు నవ్‌దీప్‌ సైనీ ప్రధాన బౌలర్‌గా ఉన్నాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌నకు ఎంపికచేసిన నెట్స్‌ బౌలర్లలో సైనీ ఒకడు. 



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net