close

ప్రధానాంశాలు

ఐపీఎల్‌: రాకాసి బౌన్సర్‌కు రసెల్‌ విలవిల

ముంబయి: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో రెండో పోరుకు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఆ జట్టు ప్రధాన ఆటగాడు, విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ ఆండ్రీ రసెల్‌ గాయపడ్డాడు. సాధన చేస్తుండగా నెట్స్‌ బౌలర్‌ మినాద్‌ మంజ్రేకర్‌ విసిరిన బౌన్సర్‌ అతడి మెడకు బలంగా తాకింది. వెంటనే అతడు నొప్పితో విలవిల్లాడాడు. నేలపై కూలబడ్డాడు. మైదానం వీడిన అతడిని జట్టు ఫిజియో వెంటనే పరీక్షించాడు. 

నొప్పితో విలవిల్లాడుతున్న రసెల్‌ను స్ట్రెచర్‌పై తీసుకెళ్లే అవకాశం ఉన్నా అతడు నడుచుకుంటూనే డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లాడు. వెంటనే అతడిని సీఎంఆరై ఆస్పత్రిలో ఎమ్మారై స్కాన్‌ చేయించారు. అతడి పరిస్థితి ఏంటో తెలియాలి. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో రసెల్‌ 13 బంతుల్లో 48 పరుగులతో ఊచకోత కోసిన సంగతి తెలిసిందే. 



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net