close

ప్రధానాంశాలు

రాజస్థాన్‌ సునాయాస గెలుపు

జైపుర్‌: ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్థాన్‌ కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌(59, 48 బంతుల్లో 5x4, 1x6) అర్ధశతకం సాధించి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అతడికి సంజుశాంసన్‌(35, 19 బంతుల్లో 6X4,1x4), రియాన్‌ పరాగ్‌ (43, 29 బంతుల్లో 5x4, 1x6) మంచి సహకారం అందించారు. కాగా స్మిత్‌, పరాగ్‌ నిలకడగా ఆడుతూ 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో రాజస్థాన్‌ గెలుపు లాంఛనమే అయింది. చివర్లో పరాగ్‌, ఆష్టన్‌టర్నర్‌(0) ఔటైనా స్మిత్‌, స్టువర్ట్‌ బిన్నీ(7) లక్ష్యాన్ని ఛేదించారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. రోహిత్‌శర్మ‌(5) తక్కువ పరుగులకే ఔటవ్వగా క్వింటన్‌ డికాక్‌(65, 47 బంతుల్లో 6x4, 2x6), సూర్యకుమార్‌ యాదవ్‌(34, 33 బంతుల్లో 1x4, 1x6) ఆచితూచి ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 97 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాక సూర్య పెవిలియన్‌ చేరాడు. కొద్దిసేపటికే డికాక్‌, పొలార్డ్‌(10) కూడా వెనుతిరగడంతో హార్దిక్‌ పాండ్య (23) దూకుడుగా ఆడాడు. దాంతో రాజస్థాన్‌ ముందు 162 పరుగుల లక్ష్యాన్ని ముంబయి నిర్దేశించింది.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net