close

ప్రధానాంశాలు

రహానెపై వేటు.. స్మిత్‌కు పగ్గాలు

జైపుర్‌: రాజస్థాన్‌ రాయల్స్‌ వైఫల్యానికి అజింక్య రహానె మూల్యం చెల్లించుకున్నాడు. వరుస పరాజయాలతో  ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకోవడంతో ఆ ఫ్రాంఛైజీ రహానెను కెప్టెన్‌గా తప్పించి బాధ్యతలను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు అప్పగించింది. శనివారం ముంబయితో మ్యాచ్‌లో అతడే జట్టును నడిపించాడు. మొత్తానికి బాల్‌ టాంపరింగ్‌ కారణంగా ఏడాది పాటు నిషేధానికి గురైన స్మిత్‌ తిరిగి ఓ జట్టుకు సారథ్య బాధ్యతలు నిర్వహించడం ఇదే తొలిసారి. స్మిత్‌పై నిషేధం కారణంగా నిరుడు రహానె కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌ రాయల్స్‌పై రెండేళ్ల నిషేధానికి ముందు స్మితే జట్టు నాయకుడు.



Tags :

మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net