close

ప్రధానాంశాలు

ధోనీలాంటి క్రికెటర్‌ మళ్లీ పుట్టరు : హీరో సిద్ధార్థ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ధోనిలాంటి క్రికెటర్‌ మళ్లీ పుట్టరని సినీ నటుడు సిద్ధార్థ్‌ అన్నాడు. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి మైదానం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. కేవలం 48 బంతుల్లో 84 పరుగులు చేసిన ధోనీ తన జట్టు విజయ తీరాలకు చేర్చేందుకు తీవ్రంగా కృషి చేశాడు. ఆఖరి ఓవర్లో 26 పరుగులు అవసరం కాగా 24 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయినప్పటికీ ధోని చేసిన ఒంటరి పోరాటం అందర్నీ కదిలించింది. దీంతో ధోనీపై ట్విటర్‌ వేదికగా పలువురు క్రికెట్‌ దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. వీరి జాబితాలోకి టాలీవుడ్‌ హీరో సిదార్థ్‌ కూడా చేరిపోయారు. ధోనిని మించిన ఆటగాడు లేడంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీని గొప్పతనాన్ని మెచ్చుకుంటూ ట్విటర్‌ ఖాతాలో స్పందించాడు. ‘ఫలితం ఏదైనా కావచ్చు. పాయింట్లతో పనిలేదు. ధోనీకి ఇది నిజమైన గెలుపు. ప్రశాంతతే ధోనీకి నిజమైన బలం. సూపర్‌మ్యాన్‌ ధోనీకి సెల్యూట్‌ చేస్తున్నా. క్రికెట్‌ను మీరు ఎంతగానో మార్చేశాడు’ అని సిద్ధార్థ్‌ పేర్కొన్నాడు. సిద్ధార్థ్‌.. తమిళ చిత్రం ‘శివప్పు మంజల్‌ పచ్చై’లో నటిస్తున్నాడు.

 



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net