close

ప్రధానాంశాలు

కొనసాగుతున్న మన్కడింగ్‌ వివాదాలు

అశ్విన్‌పై తాజాగా డేల్‌ స్టెయిన్‌ సెటైర్‌

మొహాలి: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో మన్కడింగ్‌ వివాదం చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సీజన్‌ ఆరంభంలో రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ జోస్‌బట్లర్‌ను పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మన్కడింగ్‌ చేయడం తర్వాత అనేక మంది అతడిని విమర్శించడం అన్నీ తెలిసిందే. ఈ ఘటన జరిగి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. 

శనివారం నాడు దిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌, అశ్విన్‌ మధ్య జరిగిన సరదా ఘటన(మన్కడింగ్‌ పోలిన వీడియో) సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. అశ్విన్‌ బౌలింగ్‌ చేస్తుండగా నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న శిఖర్‌ క్రీజు దాటకపోవడంతో అతడికి మన్కడింగ్‌ చేసే అవకాశం రాలేదు. దీంతో ధావన్‌ అక్కడే ఎగతాళి చేసే విన్యాసం చేసిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. 

ఇదిలా ఉండగా తాజాగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ మన్కడింగ్‌ వివాదంపై ఛలోక్తి విసిరాడు. అసలేం జరిగిందంటే.. ప్రసన్న అనే ఒకతను డేల్‌స్టెయిన్‌కు ట్వీట్‌ చేస్తూ.. ఐపీఎల్‌లో మీ జట్టు తరఫున బౌలింగ్‌ ఎటాక్‌లో ఎవరుంటే బాగుంటది అని ప్రశ్నిస్తూ.. జోఫ్రా ఆర్చర్‌, జస్ప్రిత్‌ బుమ్రా, కగిసో రబాడ, ఇమ్రాన్‌ తాహిర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇలా ఐదుగురు బౌలర్ల పేర్లు పేర్కొన్నాడు. అందుకు స్టెయిన్‌ బదులిస్తూ తనదైన శైలిలో ఛలోక్తి విసిరాడు. 

‘బుమ్రా - బౌల్డ్‌ (క్టీన్‌బౌల్డ్‌)
రబాడా - కాట్‌ (క్యాచ్‌ఔట్‌)
తాహిర్‌ - ఎల్బీడబ్ల్యూ 
అశ్విన్‌ - మన్కడ్‌’

ఇలా పోస్టు చేసి అన్ని రకాల వారిని ఉపయోగించుకుంటాం అని నవ్వుతున్న ఎమోజీ పెట్టాడు. దీంతో ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన నెటిజన్టు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net