close

ప్రధానాంశాలు

రోహిత్‌కు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు..

ముంబయి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 12వ టైటిల్‌ గెలుచుకొనేంత సమతూకంతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఉందని ఆ జట్టు కోచ్‌ మైక్‌ హెసెన్‌ అన్నాడు. మ్యాచ్‌కు ముందు సారథి రవిచంద్రన్‌ అశ్విన్‌ చక్కగా సన్నద్ధం అవుతాడని వెల్లడించాడు. జట్టులోని ప్రతి ఆటగాడిపై అతడికి అవగాహన ఉందన్నాడు. క్రిస్‌గేల్‌, కేఎల్‌ రాహుల్‌ తమ అనుభవం, ప్రతిభతో జట్టు విజయాల్లో కీలకంగా నిలుస్తున్నారని వెల్లడించాడు. ఐపీఎల్‌లో ఎంఎస్‌ ధోనీ సారథ్యానికి తిరుగులేదన్న హెసెన్‌ ముంబయి ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మకు అద్భుత నాయకత్వం నైపుణ్యం ఉందని ప్రశంసించాడు.

‘ఐపీఎల్‌ గురించి రోహిత్‌ శర్మకు ప్రతి అంశంలో అవగాహన ఉంది. జట్టులోని ఆటగాళ్ల గురించి 100 శాతం అతడికి తెలుసు. ఎప్పుడు ఎదురుదాడి చేయాలో ఎప్పుడు తగ్గాలో తెలుసు. ఓ సారథిగా రోహిత్‌ ఎందుకు విజయవంతం ఎందుకయ్యాడో మీకు అర్థం అవుతుందనుకుంటా. ఐపీఎల్‌ పరంగా చూసుకుంటే ఎంఎస్‌ ధోనీని దాటేయడం చాలా కష్టం. కానీ రోహిత్‌కు ఆ అవకాశం ఉంది’ అని మైక్‌ హెసెన్‌ అన్నాడు.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net