close

ప్రధానాంశాలు

ముంబయి ఇండియన్స్‌కు 4 రోజులు సెలవులు!

ముంబయి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మూడు సార్లు విజేత ముంబయి ఇండియన్స్‌ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లందరికీ నాలుగు రోజులు సెలవులు ప్రకటించిందని సమాచారం. అలసట నుంచి సేద తీరేందుకు కుటుంబ సభ్యులతో గడిపేందుకు అనుమతి ఇచ్చిందట. మళ్లీ శిబిరానికి వచ్చేంత వరకు బ్యాటు, బంతి పట్టుకోవద్దని గట్టిగా సూచించిందని తెలుస్తోంది. 2019 ప్రపంచకప్‌లో ఆడే ఆటగాళ్లు తగిన విశ్రాంతి తీసుకోవాలని సీజన్‌ ఆరంభానికి ముందే విరాట్‌కోహ్లీ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకుందని అనుకుంటున్నారు.

చెన్నై సూపర్‌కింగ్స్‌ తర్వాత ప్రపంచకప్‌నకు ఎంపికైన ముగ్గురు సభ్యులున్న జట్టు ముంబయి ఇండియన్సే. సారథి రోహిత్‌ శర్మ, పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌పాండ్య టీమిండియాలో అత్యంత కీలకం. వీరే కాకుండా క్వింటన్‌ డికాక్‌, లసిత్‌ మలింగ సైతం వారి దేశాల తరఫున ప్రపంచకప్‌ ఆడనున్నారు. ముంబయి ఏప్రిల్‌ 20న రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడింది. ఆ తర్వాత ఆటగాళ్లకు యాజమాన్యం విరామం ప్రకటించింది. ఏప్రిల్‌ 25న చెన్నైతో మ్యాచ్‌కు ముందు శిబిరంలో చేరాలని సూచించిందట.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net