close

ప్రధానాంశాలు

స్వదేశానికి విలియమ్సన్‌

చెన్నై : సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ స్వదేశానికి పయనమయ్యాడు. దీంతో ఈ రోజు చెన్నై వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు విలియమ్సన్‌ దూరం కానున్నట్లు సమాచారం. గతంలో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లోనూ
విలియమ్సన్‌ ఆడలేదు. వ్యక్తిగత కారణాల వల్ల న్యూజిలాండ్‌కు పయనమైనట్లు తెలిసింది. అయితే, ఏప్రిల్ 27న రాజస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌ వరకు జట్టుకు అందుబాటులో ఉంటాడు. ఈ సీజన్‌లో విలియమ్సన్‌ అంచనాల మేర ఆడలేదు.
నాలుగు మ్యాచుల్లో కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం జట్టు ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో రాణిస్తుండటంతో విలియమ్సన్‌ వైఫల్యం జట్టుపై ప్రభావం చూపించలేదు. కానీ, బెయిర్‌స్టో, డేవిడ్‌ వార్నర్‌.. టోర్నీ మొత్తం జట్టుతో
ఉండే అవకాశం లేదు. దీంతో జట్టు బ్యాటింగ్‌ బాధ్యతలు విలియమ్సన్‌ భూజాల మీద వేసుకోవాల్సి ఉంటుంది. గత సీజన్‌లో 735 పరుగులు చేసిన కేన్‌ ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net