close

ప్రధానాంశాలు

‘రికీ దాదాగిరి’ వల్లే దిల్లీ ఇలా..

జయపుర: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 12వ సీజన్‌లో సౌరవ్‌ గంగూలీ, రికీ పాంటింగ్‌ వల్లే దిల్లీ క్యాపిటల్స్‌ దూసుకుపోతోందని యువ ఆటగాడు పృథ్వీషా అన్నాడు. వారిద్దరి మార్గదర్శకత్వంలో అన్ని జట్లపై దిల్లీ ఆధిపత్యం చెలాయించే స్థితికి చేరుకుందని వెల్లడించాడు. చివరి తొమ్మిది సీజన్లలో దిల్లీ నాలుగు సార్లు చివరి స్థానానికే పరిమితమైంది. మ్యాచ్‌ గెలవాలంటే ఎన్నో ఆపసోపాలు పడేది. ప్రస్తుత సీజన్‌లోనూ దిల్లీ క్యాపిటల్స్‌ ఇబ్బందులు పడ్డా వాటి నుంచి బయటపడింది. కోచ్‌ రికీ పాంటింగ్‌, సలహాదారు సౌరవ్‌ గంగూలీ, సహాయక కోచ్‌ మహ్మద్‌ కైఫ్‌ ఆటగాళ్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

‘సౌరవ్‌ సర్‌, రికీ సర్‌, కైఫ్‌ సర్‌ మాకు అండగా ఉండటంతో మా శరీర భాష మారింది. సందీప్‌ లామిచానె, మన్‌జ్యోత్‌ కల్రా నాలాంటి కుర్రాళ్లే. మేమెప్పుడూ అనుభవం లేదని అనుకోలేదు. మైదానంలో, బయట, డ్రెస్సింగ్‌ రూమ్‌లో మమ్మల్ని సీనియర్లతోనే ఉంచారు. సాధన లేనప్పుడు సౌరవ్‌ సర్‌ మాతో కలిసి సేద తీరుతారు. మేమంతా కలిసే భోజనం చేస్తాం. అందుకే మా మధ్య అనుబంధం మరింత బలపడింది’ అని పృథ్వీషా అన్నాడు.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net