close

ప్రధానాంశాలు

పన్నెండేళ్లలో పన్నెండుతో తొలిసారి

అతి తక్కువ పాయింట్లతో ప్లేఆఫ్స్‌ చేరిన జట్టుగా సన్‌రైజర్స్‌ రికార్డు

ఉత్కంఠకు తెరపడింది. ఐపీఎల్‌ 12వ సీజన్‌ ప్లేఆఫ్స్‌ ఆడబోయే నాలుగో జట్టేదో తేలిపోయింది. ఆ అవకాశం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు దక్కింది. ఆ జట్టు ఆరు  విజయాలతోనే బెర్తు సంపాదించడం విశేషం. ఐపీఎల్‌ చరిత్రలోనే అతి తక్కువ పాయింట్లతో (12) ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టు హైదరాబాదే. ఇప్పటిదాకా కనిష్టంగా    14 పాయింట్లతోనే జట్లు ముందంజ వేశాయి. లీగ్‌ దశ చివరి మ్యాచ్‌లో కోల్‌కతా.. ముంబయి చేతిలో ఓడిపోవడంతో సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్స్‌లో స్థానం దక్కింది. సన్‌రైజర్స్‌తో పాటు కోల్‌కతా, పంజాబ్‌ సైతం 12 పాయింట్లతో సమానంగా నిలిచాయి. ఐతే నెట్‌రన్‌రేట్‌ (+0.577) మెరుగ్గా ఉండటంతో సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌ బెర్తు దక్కించుకుంది. కోల్‌కతా (+0.028), పంజాబ్‌ (-0.251)లకు నిరాశ తప్పలేదు. ఇక కోల్‌కతాను ఓడించిన ముంబయి 18 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. చెన్నై, దిల్లీ కూడా అన్నే పాయింట్లు సాధించినప్పటికీ.. మెరుగైన నెట్‌రన్‌రేట్‌ (+0.421)తో వాటిని ముంబయి వెనక్కి నెట్టింది. చివరి మ్యాచ్‌లో పంజాబ్‌ చేతిలో ఓడినప్పటికీ.. దిల్లీ (+0.044) కంటే నెట్‌రన్‌రేట్‌ ఎక్కువ ఉన్న చెన్నై (+0.131) రెండో స్థానం సాధించింది. లీగ్‌ దశలో టాప్‌-2లో ఉన్న జట్లకు ప్లేఆఫ్స్‌ దశలో అదనపు అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిందే.



Tags :

మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net