close

ప్రధానాంశాలు

హార్దిక్‌ పాండ్యపై జాతి విద్వేష వ్యాఖ్యలు

ముంబయి: ముంబయి ఇండియన్స్‌ క్రికెటర్‌, టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య మరోసారి వార్తల్లో నిలిచాడు. టీవీ నటి క్రిస్టల్‌ డిసౌజ అతడితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో నెటిజెన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఒక వ్యక్తి అయితే ఏకంగా జాత్యంహంకార వ్యాఖ్యలు చేశాడు.

క్రిస్టల్‌ ఓ ఫొటో పోస్టు చేసి ఇలా రాసింది. ‘మా సోదరుడిలా మరెవరూ బలంగా కొట్టలేరు’ అని #Brotherfromanothermother అనే హ్యాష్‌టాగ్‌ను జతచేసింది. ఇది చూసిన ఓ వ్యక్తి పాండ్యపై ‘భాయ్‌, మీరు వెస్టిండీస్‌ తరఫున ప్రపంచకప్‌ జట్టులో ఎందుకు ఎంపిక అవ్వలేదు’ అంటూ కామెంట్‌ పెట్టాడు.

ఇది చూసిన నటుడు అపర్‌శక్తి ఖురానా స్పందిస్తూ ఆ వ్యక్తిని సమీర్‌గా గుర్తించాడు. ‘‘నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు. ఇలాంటి మాటలు అనకూడదు. హార్దిక్‌ పాండ్య బాగా ఆడతాడు కాబట్టి మనమంతా ఇష్టపడతాం. ప్రపంచకప్‌ ముందు మీరు టీమిండియాకి మద్దతు తెలపాల్సింది పోయి ఇలా అనకూడదు’ అని స్పందించాడు.  ఇందుకు క్రిస్టల్‌డిసౌజా ప్రతిస్పందించింది. ‘మీరు చాలా బాగా చెప్పారు. కొంతమంది ఉంటారు. ఇంట్లో కూర్చొని ఏదైనా కామెంట్‌ చెయ్యొచ్చని అనుకుంటారు. ఇలాంటి వాటిని పట్టించుకోకపోవడమే మంచింది. వీరి వాఖ్యల వల్ల హార్దిక్‌ పాండ్య బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పు ఉండదు. మీరు స్పందించినందుకు ధన్యవాదాలు’’ అని పేర్కొంది. 



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net