close

ప్రధానాంశాలు

రోహిత్‌శర్మను ఇంటర్వ్యూ చేసిన రితిక  

మ్యాచ్‌ అనంతరం యువీతో కలిసి విజయోత్సాహం

హైదరాబాద్‌: చెన్నైపై గెలుపు అనంతరం ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మను అతడి భార్య రితిక ఇంటర్వ్యూ చేసింది. తమ కూతురు సమైరా ముందు నాలుగోసారి టైటిట్‌ గెలవడం ఎలా ఉందని అడిగింది. అందుకు రోహిత్‌ బదులిస్తూ.. ‘ఇదెంతో ప్రత్యేకం. సమైరాతో పాటు నువ్వు కూడా. తనకిదే మొదటి ఐపీఎల్‌. అయినా చాలా మ్యాచులకు హాజరైంది. ఈ విజయంతో నాకు చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నాడు. మ్యాచ్‌ అనంతరం అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గల్లీబాయ్‌ పాటకు విజయోత్సాహంతో చిందులేశాడు. అతడికి యువరాజ్‌సింగ్‌ తోడవ్వడంతో ఇద్దరూ కలిసి సరదాగా గడిపారు. ఈ వేడుకకు రితికతో పాటు ముంబయి ఆటగాళ్లు కూడా హాజరయ్యారు. 

గల్లీబాయ్‌ సినిమాలోని ‘అస్లీ హిప్‌ హాప్‌ సే మిలాయే’ పాటను ‘అస్లీ హిట్‌మ్యాన్‌ సే మిలాయే’గా మార్చి స్టెప్పులేశారు. కాగా రోహిత్‌ అంతలా సంబరపడటానికి కారణాలు లేకపోలేదు. ఎందుకంటే అతడు ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్‌గా విఫలమైనా కెప్టెన్‌గా మెరుగ్గా రాణించాడు. మేటి కెప్టెన్లకు దీటుగా ప్రత్యర్థులను ఓడించాడు. జట్టుపై నమ్మకముంచి ముందుండి నడిపించాడు. అలాగే జట్టులోని సభ్యులు సైతం రోహిత్‌కు బాగా సహకరించారు. ఏ ఒక్కరూ ధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో జాగ్రత్తగా ఆడి చెన్నైపై విజయం సాధించారు. చేసింది 149 పరుగులే అయినా సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ఆఖరి ఓవర్‌లో 9 పరుగులే మిగిలినా మలింగ అద్భుతమైన బౌలింగ్‌తో ముంబయి విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐపీఎల్‌లో నాలుగోసారి టైటిల్‌ సాధించిన తొలి కెప్టెన్‌గా రోహిత్‌ రికార్డు సృష్టించాడు.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net