ప్రధానాంశాలు

Published : 28/08/2020 19:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దినేశ్‌ కార్తిక్‌ అలా చేయగలడా అనేదే సందేహం!

మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ఏమన్నాడంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తిక్‌ ఒక్కసారి క్లిక్‌ అయితే మళ్లీ టీ20ల్లో టీమ్‌ఇండియాకు ఎంపికయ్యే అవకాశముందని, అయితే అతడలా చేయగలడా అనేదే ప్రశ్నగా మిగిలిందని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. తాజాగా అతడు ఫేస్‌బుక్‌లో అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా ఒకతను డీకేపై అడిగిన ప్రశ్నకు ఇలా స్పందించాడు. టీ20ల్లో ఐదో స్థానంలో రిషభ్‌ పంత్‌, మనీశ్‌ పాండే ఇంకా తమ స్థానాలను భర్తీ చేసుకోనందున ఈ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌, కీపర్‌కు అవకాశం ఉందా అని అడిగాడు. దానికి చోప్రా జవాబిస్తూ.. ‘మీరు చెప్పేది నిజమేనని నేనూ అనుకుంటున్నా. డీకే కచ్చితంగా తిరిగి జట్టులోకి రాగలడు. అయితే, అతడలా చేయగలడా లేదా అనేదే అసలైన విషయం’ అని పేర్కొన్నాడు. 

‘డీకే తొలుత చేయాల్సిన పని కేకేఆర్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు రావాలి. ఎందుకంటే ప్రస్తుతం అతడు మిడిల్‌ ఆర్డర్‌లో ఆడుతున్నాడు. అక్కడ బ్యాటింగ్‌ చేస్తే ఎక్కువ పరుగులు సాధించే అవకాశం ఉండదు. కాబట్టి టాప్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తే మంచి పరుగులు రాబట్టవచ్చు. అలా కాకుండా కెప్టెన్‌గా ఉన్నానని ఐదో స్థానంలోనే ఆడితే తగినన్ని పరుగులు చేయలేడు. అయితే దినేశ్‌ కీపర్‌గానూ రాణిస్తున్నాడు. కానీ టీమ్‌ఇండియాకు ఇప్పటికే కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌ లాంటి ఇద్దరు కీపర్‌, బ్యాట్స్‌మెన్‌‌ ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో అతడు ఆడాలంటే కచ్చితంగా రెండు ఐపీఎల్‌లలో రాణించాలి’ అని చోప్రా వివరించాడు. ఇదిలా ఉండగా, గంభీర్‌ కేకేఆర్ కెప్టెన్‌గా తప్పుకున్నాక డీకే 2018లో ఆ జట్టు పగ్గాలు అందుకున్నాడు. అతడి సారథ్యంలో గత రెండు సీజన్లలో ఆడిన కోల్‌కతా పెద్దగా రాణించలేకపోయింది. ఈసారైనా మరింత మంచి ప్రదర్శన చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net